టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ లేకపోతే ఎలాంటి వారైనా కెరియర్ ముందుకు నెట్టుకు రావడం అంత ఆశ మాసి విషయం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే చాలు ఇక తమ కెరీర్ కు పులిస్టాప్ పడినట్లే అని చెప్పవచ్చు. అగ్ర హీరోయిన్లు కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము కాబట్టి ఏ సినిమా నైనా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఆ విధంగా హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా చేయకపోవడం వల్ల దాదాపుగా ఈమె కెరియర్ క్లోజ్ అయినట్లే అని పలువురు సినీ ప్రేక్షకుల సైతం భావిస్తున్నారు.

Rakul Preet Singh was called a 'stick' in South industry, was asked to lose  weight when she came to Mumbai: 'That was the standard of Bombay' |  Entertainment News,The Indian Express
మొదట వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. ఇక తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేయడం మొదలుపెట్టి టాలీవుడ్ పరిశ్రమనే మరిచిపోయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈమెకు తెలుగులో సినిమాలు కరువయ్యా అని చెప్పవచ్చు. గతంలో ఎంతో మంది హీరోయిన్లు కూడా ఇలాంటి తప్పే చేశారు కానీ వారిని చూసి కూడా ఇప్పుడు హీరోయిన్లు మళ్లీ ఇలాంటి తప్పే చేస్తున్నారు.

బాలీవుడ్ పైన మోజుతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఈమె కెరియర్ అక్కడ ఇక్కడ సక్సెస్ కాలేకపోతోందని చెప్పవచ్చు. మరి రియంట్రీ ఇవ్వడానికి కూడా పలు ప్రయత్నాలు చేస్తున్నది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రి యంట్రీతో అయినా రకుల్ ప్రీతిసింగ్ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉందని చెప్పవచ్చు అంతేకాకుండా గ్లామర్ను ఎక్కువ మొత్తంలో చూపించే హీరోయిన్గా కూడా పేరుపొందింది.