ఎమ్మెల్యేగా రాజుగారు..వైసీపీపై రివెంజ్..?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వైసీపే తరుపున నర్సాపురం ఎంపీగా గెలిచిన ఆయన..ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు చేశారు. వైసీపీ తప్పులని నిత్యం ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఇక తమని టార్గెట్ చేసిన్ రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. అయినా సరే రఘురామ ఢిల్లీలో ఉంటూ..ప్రాతిరోజూ మీడియా సమావేశం పెట్టి..జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇలా వైసీపీ రెబల్‌గా ఉన్న రఘురామ రాజకీయ భవిష్యత్ ఏంటి? అని ప్రశ్న వస్తే..నెక్స్ట్ ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరతారని ప్రచారం ఉంది. రెండు పార్టీల పొత్తు బట్టి ఆయన చేరిక ఉండే ఛాన్స్ ఉంది. అలాగే నరసాపురంలో పోటీ విషయం కూడా పొత్తు బట్టే ఉండనుంది. ఒకవేళ నర్సాపురంలో పోటీకి కుదరకపోతే ఆయన రాజమండ్రి పార్లమెంట్‌లో పోటీ చేస్తారని ప్రచారం ఉంది. రాజమండ్రి పరిధిలో కూడా టీడీపీకి బాగా పట్టు ఉంది..జనసేన సపోర్ట్ ఉంటే ఆ ఎంపీ సీటుని ఈజీగా గెలిచేస్తారు.

మొత్తానికి రఘురామ..నర్సాపురం లేదా రాజమండ్రి ఎంపీగా పోటీ చేయొచ్చని తెలుస్తోంది. పొత్తు బట్టి టీడీపీ లేదా జనసేన నుంచి బరిలో దిగే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటివరకు రఘురామపై జరిగిన ప్రచారం ఇది. తాజాగా మరొక ప్రచారం తెరపైకి వచ్చింది. అది ఏంటంటే..వైసీపీపై రివెంజ్ తీరుచుకోవాలంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్ వస్తుంది. ఎందుకంటే రఘురామని తిట్టిన వారంతా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కువ ఉన్నారు.

వారిపై రివెంజ్ తీర్చుకోవాలంటే రఘురామ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, అలాగే అధికారంలోకి వస్తే మంత్రి కూడా అయ్యి..అసెంబ్లీలో వైసీపీపై విరుచుకుపడాలనేది రఘురామ కాన్సెప్ట్‌గా ఉందని ప్రచారం జరుగుతుంది. కాకపోతే రఘురామ వ్యాపారాలు అన్నీ ఢిల్లీతో ముడిపడి ఉన్నాయి..కాబట్టి ఆయన ఎంపీ సీటుపై ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా వైసీపీకి చెక్ పెట్టాలంటే ఎమ్మెల్యేగా కూడా బరిలో దిగవచ్చని తెలుస్తోంది.