అల్లు అర్జున్ ఆ సినిమా కోసం రూ.100 కోట్లు తీసుకుంటున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు హీరో అల్లు అర్జున్. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం ఇతర భాషలలో కూడా పుష్ప సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు సంపాదించారు అల్లు అర్జున్. ఇక డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.అందుచేతనే పుష్ప -2 సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun Walks Out Of The Film, For Which He Was Rumoured Of Getting 100  Crores' Salary, Due To Atlee's Shocking Remuneration?
పుష్ప-2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ కి అవకాశం ఇస్తారనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో ,ఆటు అభిమానులలో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ అయిన అట్లీ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రాబోతోందని ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లుగా సమాచారం.

After 'Pushpa', Allu Arjun in the demand of the makers, 100 crores fee was  offered for the film Atli

బన్నీ ఈ సినిమా కోసం రూ.100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది.అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే రెమ్యూనరేషన్ విజయంలో టాప్ పొజిషన్లో అల్లు అర్జున్ ఉంటారని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉన్నది.