తారక్ పై చంద్రమోహన్ సంచలన కామెంట్స్..పేరు అడిగితే అలా చేసేవారట..!!

తెలుగు చిత్ర పరిశ్రమంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన కెరియర్ మొదటిలో పలు సినిమాల్లో హీరోగా నటించి. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఈయనతో ఏ హీరోయిన్ నటించిన స్టార్ హీరోయిన్ అవుతారని సెంటిమెంట్ కూడా ఒకటి ఉండేది. ఈ సెంటిమెంట్ ఉండడంతో చంద్రమోహన్ తో స్టార్ హీరోయిన్లు ఆయనతో నటించడానికి క్యూ కట్టేవారు.
చంద్రమోహన్ వయసు పెరగడంతో హీరోగా మానేసి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాా నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ను తెచ్చుకున్నారు. ఇప్పటికి కూడా ఆయన అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. చంద్రమోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Veteran actor Chandra Mohan refutes rumours about his ill health, shares video - Movies News

ఆయన మాట్లాడుతూ..’ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే సమయానికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇంకా పుట్టలేదు. జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం సినిమాలో నటించినప్పటి నుంచి పరిచయం. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ నాతో బాగా నటించేవాడు అంటూ చంద్రమోహన్ చెప్పాడు. ఎన్టీఆర్ తన చిన్నతనంలోనే బాల రామాయణం సినిమాలో నటించాడు.. ఆ సమయంలో నేను ఇటు రారా నాన్న అని పిలవగా ఎన్టీఆర్ వచ్చాడని… నేను మీ పేరు ఏమిటి అని అడగగా.. ఒక చేతిపై మరో చేతిని కొడుతూ ఎన్టీ రామారావు అని చెప్పాడు… అని చంద్ర మోహన్ కామెంట్లు చేశాడు. నేను మీ తాత గారి పేరు చెబుతావేంటి అని అడగగా హరికృష్ణ వీడికి కూడా వాళ్ల తాత గారి పేరు పెట్టామని చెప్పారు. దీంతో నాకు అది చాలా ఆనందం కలిగించిందని చంద్రమోహన్ తెలిపారు’.

Baadshah Jabardasth Comedy | Chandramohan Confusing Abou NTR & Kajal Love Matter | HD - YouTube

ఈ విధంగా పేరు చెప్పేలా జూనియర్ ఎన్టీఆర్ కు ట్రైనింగ్ ఇచ్చారని అందుకే అలా చెప్పేవాడని చంద్రమోహన్ కామెంట్లు చేశారు. తారక్ ఎన్టీఆర్ అంటు తనదైన స్టైల్ లో మాడ్యులేషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడని.. చంద్రమోహన్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. చంద్రమోహన్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పలు సినిమాల్లో కూడా నటించాడు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.

Share post:

Latest