యూట్యూబ్ లో ఎక్కువమంది చూసిన.. టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదే..!

యూట్యూబ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సినిమా ట్రైలర్లు, టీజర్లు, పాటలు మేకింగ్ వీడియోలు వంటివి.. సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు ఎంత ముఖ్యమో యూట్యూబ్ లో వచ్చే వ్యూస్- లైక్స్ కూడా అంతేే ముఖ్యం.. ఓటీటీలు రానంత వరకు యూట్యూబ్ హవా నడిచింది. థియేటర్లో రిలీజ్ అయిన సినిమా కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యేవి.. ఇక్కడ ఏ సినిమాకు ఎన్ని వ్యూస్ లైక్స్ వచ్చాయో అనేది కూడా కచ్చితంగా అందరికీ తెలుస్తుంది.. అదే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వచ్చాక సినిమా రిజల్ట్ అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే… యూట్యూబ్ లో కొన్ని సినిమాలు రికార్డు వ్యూస్ ను దక్కించుకున్నాయి.. యూట్యూబ్‌లో కొన్ని సినిమాల‌ను వ్యూవర్స్ ఎగబాడి మరీచూశారు.. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Hyderabad court serious on Mahesh Babu and Srimanthudu filmmakers

శ్రీమంతుడు:
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా యూట్యూబ్‌లో కూడా భారీ వ్యూస్ ను దక్కించుకుంది. ఏకంగా ఈ సినిమా 179 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లోనే టాప్ ప్లేస్ లో ఉంది.

DJ [Duvvada Jagannadham] - Disney+ Hotstar

డీజే- దువ్వాడ జగన్నాథం:
అల్లు అర్జున్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా డీజే.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ సినిమాగా నిలిచింది.. సినిమా యూట్యూబ్‌లో మాత్రం భారీ వ్యూస్ ను దక్కించుకొని సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఏకంగా యూట్యూబ్‌లో 128 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది.

Nenu Local Movie Motion Poster | Nani | Tollywood

నేను లోకల్:
నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన సినిమా నేను లోకల్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నానికి సూప‌ర్ హిట్ సినిమాగా నిలిచింది. యూట్యూబ్ లో కూడా ఈ సినిమా 104 మిలియన్ న్యూస్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది.

Sathamanam Bhavati Movie Songs Lyrics | Sharvanand , Anupama Parameswaran -  TeluguLyrics2u

శతమానం భవతి:
శర్వానంద్ అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా శతమానంభవతి. ఈ సినిమాను సతీష్ వేగేశ్న తెరకెక్కించాడు. ఈ సినిమా యూట్యూబ్‌లో ఏకంగా 95 మిలియన్ న్యూస్ తో దూసుకుపోతుంది.

Janatha Garage - Disney+ Hotstar

జనతా గ్యారేజ్:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎన్టీఆర్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చింది. సినిమా యూట్యూబ్‌లో కూడా సెన్సియేషన్ క్రియేట్ చేసింది.. ఈ సినిమా యూట్యూబ్‌లో ఏకంగా 72 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

Watch Rarandoi Veduka Chudham on ott streaming online

రారండోయ్ వేడుక చూద్దాం:
నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించినన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా యూట్యూబ్ లో కూడా 70 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

Nuvvostanante Nenoddantana' (2005)

నువ్వొస్తానంటే నేనొద్దంటానా:
సిద్ధార్థ- త్రిష హీరో- హీరోయిన్గా నటించినిన ఈ సినిమాను ప్రభుదేవా తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదల ఇన్ని సంవత్సరాలు అవుతున్న యూట్యూబ్‌లో 57 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది.

Watch Race Gurram on ott streaming online

రేసుగుర్రం:
అల్లు అర్జున్ -శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా యూట్యూబ్ లో కూడా 41 మిలియన్ న్యూస్ ను దక్కించుకుంది.

Watch Mirchi | Prime Video

మిర్చి:
ప్రభాస్- అనుష్క జంటగా కొరటాల శివ మొదటి సినిమాగా వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌కు అదిరిపోయే హిట్ నిచ్చింది. కొరటాలను స్టార్ట్ దర్శకుని చేసింది. ఈ సినిమా యూట్యూబ్‌లో 36 మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది.

Watch Magadheera Full Movie Online for Free in HD Quality | Download Now

మగధీర:
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ కి రెండో సినిమాగా వచ్చింది మగధీర. ఈ సినిమా రామ్ చరణ్ కు అదిరిపోయే స్టార్ డం అని ఇచ్చింది. రామ్ చరణ్ కెరియర్ లోనే చెప్పుకోదాగా సినిమాల్లో మగధీర కూడా ఒకటి. సినిమా యూట్యూబ్‌లో కూడా ఇప్పటికీ 34 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి