రాజమౌళి ‘ఛాన్స్’ ఇచ్చినా.. కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ ఈమె..!?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం . రంగుల ప్రపంచం. ఈ గ్లామరస్ వరల్డ్ లో రంగులు మార్చే ఊసరవెల్లిలు చాలామంది ఉంటారు. వాళ్ళ కారణంగా బోలెడు ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మలు కెరియర్ సర్వనాశనం చేసుకొని అటు ఫ్యామిలీకి ఇటు సినీ ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతూ బాధపడిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం అంటే మాటలు కాదు .వచ్చిన ప్రతి హీరోయిన్ టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అవ్వదు . ఎవరో అదృష్ట వంతురాలు తప్పిస్తే మిగతా వాళ్లంతా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళలేరు.

పాపం సినీ ఇండస్ట్రీపై బోలెడన్ని ఆశలు పెట్టుకొని హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన రుతిక.. అలాగే ఈ సినీ ఇండస్ట్రీలోని మాయలకు బలైపోయింది. రుతిక అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు .కానీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన అమ్మాయి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. రాజమౌళి డైరెక్షన్లో మాస్ మహారాజ హీరోగా నటించిన సినిమా విక్రమార్కుడు . ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా అనుష్క నటిస్తే ..రెండవ హీరోయిన్గా రుతిక నటించింది.

అయితే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ చేతిలో పడినా కానీ రుతిక కెరియర్ బాగుపడలేదు . ఈ సినిమా తర్వాత రుతికాకు చాలా ఆఫర్లు వచ్చాయి . కానీ ఆశించిన స్థాయి ఆఫర్స్ కాకపోవడంతో అన్ని రిజెక్ట్ చేసింది .ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. విక్రమార్కుడు కంటే ముందు రుతిక చాలా సినిమాల్లో నటించింది. ” సరదాగా సరదాగా, గర్ల్ ఫ్రెండ్, బ్లేడ్ బాబ్జి , జాన్ అప్పారావు 40 ప్లస్, ప్రేమాభిషేకం అనే సినిమాల్లో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నింది”. అయినా కానీ మన దర్శక నిర్మాతలు అమ్మడు ఆశించిన స్థాయి ఇవ్వలేకపోయారు . దీంతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవ్వాలి అన్న తన కల కల్గానే మిగిలిపోయింది. ఒకటైతే నిజం సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే కాదు లక్ కూడా ఉండాలి అని మరోసారి ఈ హీరోయిన్ ప్రూవ్ చేసింది.

Share post:

Latest