అమ్మ బాబోయ్..ఒక్కే రీజన్ తో ..ఘోస్ట్ సినిమాను ఇంతమంది స్టార్ హీరో లు రిజెక్ట్ చేశారా?

సినీ ఇండస్ట్రీలో హీరో అనుకున్న కథను మరో హీరో చేయడం సర్వసాధారణం. డేట్స్ అడ్జస్ట్ చేయలేక కావచ్చు , కధ నచ్చక కావచ్చు.. రీజన్స్ ఏవైనా కానీ కొందరు స్టార్ హీరోలు కూడా ఇలా తమ కమిట్మెంట్లకు బలై మంచి మంచి స్టోరీలను మిస్ చేసుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి . అయితే ఒకే రీజన్ చెప్పి దాదాపు 5 మంది స్టార్ హీరోలు ఒకే కథను రిజెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. దీంతో “ది ఘోస్ట్” సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం రండి..!!

టాలీవుడ్ కింగ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా అందాల బొమ్మ సోనాలి చౌహన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా “ది ఘోస్ట్”. మల్టీ టాలెంటెడ్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మరీ ముఖ్యంగా ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను ప్రాణం పెట్టి డైరెక్ట్ చేశాడని నాగార్జున చెప్పడం సంచలనంగా మారింది. అంతే కాదు దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు సినిమా యూనిట్ . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేసి జనాల్లోకి తీసుకెళ్తున్నారు “ది ఘోస్ట్ టీం”.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రవీణ్ మాట్లాడుతూ ..”ఈ సినిమా కోసం బోలెడు మంది హీరోయిన్స్ ని అనుకున్నామని.. కానీ యాక్షన్ సీన్స్ చేసే దానికి ఏ హీరోయిన్ ముందుకు రాకపోవడంతో.. ఫైనల్ గా సాహసం చేసింది సోనాలి చౌహాన్ అని చెప్పుకొచ్చారు . అంతేకాదు ఈ సినిమాలో సోనాలి చాలా బాగా నటించిందని ..కచ్చితంగా ఈ సినిమాతో తెలుగులో అమ్మడుకు బోలెడు అవకాశాలు వస్తాయి” అని చెప్పుకొచ్చారు . అయితే ఇదే క్రమంలో సినిమాలు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాను దాదాపు ఐదు మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట.

అందులో మొదటిగా రిజెక్ట్ చేసింది రానా దగ్గుబాటి. నిజానికి ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను రానా దగ్గుబాటికి ఫస్ట్ చెప్పారట. కానీ ఆయన ఈ కథను వినగానే నా బాడీకి సెట్ అవ్వదు నేను చేసిన వేస్ట్ అంటూ కొట్టి పారేసాడట .ఇక తర్వాత సుధీర్ బాబుకు ఈ సినిమా కధని చెప్పారట . ఆయన కూడా స్టోరీ పెద్దగా నా బాడీకి మ్యాచ్ అవ్వదు అంటూ లైట్ తీసుకున్నారట. ఇక తర్వాత నితిన్, రామ్, నాచురల్ స్టార్ నాని ఇలా ముగ్గురు యంగ్ హీరోలకు ఈ కథను వివరించారట.

వీళ్ళు కూడా సేమ్ రీజన్ తో కధను రిజెక్ట్ చేశారట. మా బాడీకి ఈ కథ మ్యాచ్ కాదు అంటూ ఒకే ఒక్క లైన్లో ఈ సినిమాను కొట్టి పడేసారట. దీంతో తీవ్రంగా ఆలోచించిన ప్రవీణ్ ఆ తర్వాత ఒక్కసారిగా సీనియర్ హీరోల వైపు ఫోకస్ చేసారట. అంతే డైరెక్టుగా నాగార్జునకు ఈ సినిమా కథను వివరించారట . కథ మెచ్చిన నాగార్జున వెంటనే డేట్స్ ఇవ్వడం ఆ తర్వాత వెంటనే తెరకెక్కించడం జరిగిపోయాయి. మరి చూడాలి ఇంత మంది రిజెక్ట్ చేసిన ” ది ఘోస్ట్ “సినిమా నాగార్జున ఖాతాలో ఎలాంటి హిట్ పడేలా చేస్తుందో..?

Share post:

Latest