కొత్త చిక్కులో చిట్టి..అదే కొంప ముంచేసిందా..? షాకింగ్ విషయం చెప్పిసిన ఫరియా..!!

ఫరీయా అబ్దుల్లా.. ఏంటి ఈ పేరు కొత్తగా ఉందే.. ఎవరు అబ్బా ఈమె? ఈ హీరోయిన్ ఏ సినిమాలో నటించింది ..అని అనుకుంటున్నారా..? ఫరీయా అబ్దుల్లా అంటే ఎవరో కాదండి జాతి రత్నాలు సినిమాలో “చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే” అంటూ రింగురింగుల జుట్టుతీ అలరించిన ఆ అమ్మడునే ఈ చిట్టి. ఇప్పుడు గుర్తొచ్చిందా ..!!

Jathi Ratnalu 19 days Worldwide Collections

చిట్టి పాత్రలో తన స్మైల్ తో కుర్రాలని ఆకట్టుకున్న ఆ బబ్లీ బ్యూటీని ఈ ఫరీయా అబ్దుల్లా ఒరిజినల్ పేరు కన్నా సినిమాలోని పేరుతోనే పాపులార్ అయింది . ఇప్పటికీ ఈమె పేరు ఫరీయా అబ్దుల్లా అని ఎవరికి తెలియదు. చిట్టి చిట్టి అంటూనే పిలుస్తుంటారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా అంతే. చిట్టి అంటూనే పిలుస్తున్నారు. అంతలా తన పాత్రతో పాపులారిటీ సంపాదించుకుంది.

కసిగా చూస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిట్టి.. జాతిరత్నాలు బ్యూటీ హాట్ లుక్స్ - faria abdullah hot photos viral on social media - Samayam Telugu

కాగా.. రీసెంట్గా యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన “లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ” సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉంది ఎవరో కాదు నాగబాబు కూతురు నిహారిక. కాగా ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోని సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో ఫరియా అబ్దుల్లా- సంతోష్ శోభన్ బిజీగా ఉన్నారు . ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Like Share and Subscribe - Video Song | Santosh Shobhan, Faria Abdullah | Praveen Lakkaraju - YouTube

ఈ క్రమంలోనే చిట్టి తన పేరుతో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..” ఓసారి నేను క్యాబ్లో వెళ్తూ ఉన్నాను డ్రైవర్ చాలా మూడిగా డల్ గా కూర్చొని ఉన్నాడు. దీంతో ఏమైంది అన్నా అంటూ పలకరించాను. ఆయన మాట్లాడుతూ.. నా చిన్నప్పటి క్రష్ చిట్టి అని ..నాకు చాలా గుర్తొస్తుందని.. మర్చిపోలేకపోతున్నాను.. అని చెప్పి బాధపడ్డాడు. ఈ క్రమంలోనే అవునా నా పేరు కూడా చిట్టి అని చెప్పాను. అంతే వెంటనే ఒక్కసారిగా రోడ్డు మధ్యలోనే కార్ ఆపేసి వెనక్కి తిరిగి నన్ను చూస్తూ మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు.. మీ ఊరు ఎక్కడ అంటటూ నా వివరాలను ఆరా తీశాడు .

దీంతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను, నా ఒరిజినల్ పేరు చిట్టి కాదని సినిమాలో నటించిన పేరు చిట్టి అని నా ఐడి కార్డు చూపించే వరకు అతను నమ్మలేదు ..ఇలా చిట్టి అన్న పేరుతో నేను కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది . కాదా ఫరీయా అబ్దుల్లా హైట్ ఆమెకు మైనస్ గా మారినట్టు జనాలు చెప్పుకొస్తున్నారు. మన ఇండస్ట్రీలో ఉండేది అందరూ కొంచెం హైట్ తక్కువ హీరోలు. ఫరీయా అబ్దుల్లా ఏమో ఇంచుమించు ప్రభాస్ హైట్ ఉంటుంది. ఆమె పక్కన ఎవరు హీరోగా చేసేందుకు ఇష్టపడట్లేదు. అందుకే ఆమె ఇండస్ట్రిలో అవకాశాలు రాలేదంటూ ఓ న్యూస్ ఫైనల్ గా మారింది . మరి చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాతో ఏ మేర అవకాశాలు దక్కించుకుంటుందో ఈ చిట్టి..?