సాయిపల్లవి చైల్డ్ యాక్టర్ గా నటించిన చిత్రం ఏంటో తెలుసా..?

తెలుగు సీని ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఫిదా చిత్రంతో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం లేడి పవర్ స్టార్ అని బిరుదు కూడా దక్కించుకుంది. ఇటీవల వరుసగా శ్యామ్ సింగ రాయ్, విరాటపర్వం, గార్గి వంటి సినిమాలతో అలరించిన సాయి పల్లవి కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటుంది. మలయాళం అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు అమ్మాయి అనేలా గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంటోంది.

I Don't Like To Stand Still When The Hero Is Fighting: Sai Pallavi
సాయి పల్లవి పాత్ర నచ్చితే రెమ్యూనరేషన్ విషయంలో కూడా పెద్దగా అభ్యంతరాలు చొప్పదనే విషయం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. అయితే సాయి పల్లవి చైల్డ్ డైరెక్టర్ గా నటించిన సినిమా ఒకటి ఉందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఆ చిత్రంలో కంగానరనౌత్ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఆ చిత్రమే దామ్ దూమ్ అని చిత్రంలో సాయి పల్లవి నటించిందట ఈ సినిమాలో నటించే సమయానికి ఈమె వయసు కేవలం 6 సంవత్సరాలేనట. అయితే కేవలం తన టైం పాస్ కోసమే ఆ సినిమాల నటించాలని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Sai Pallavi Wiki, Height, Age, Boyfriend, Family, Biography & More - WikiBio

ఈ మధ్యకాలంలో సాయి పల్లవి పైన పలు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రేమ్యునరేషన్ విషయంలో కాస్త డిమాండ్ చేస్తోందని వార్తలు వినిపించాయి అయితే ఈ వార్తలన్నిటిని కొట్టివేసింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం తమ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. సాయి పల్లవి తను నటించే పాత్రలు కొన్ని పరిధిలు పెట్టుకోని నటిస్తూ ఉంటుంది.