అల్లు ఫ్యామిలీ పై కావాలనే దుష్ప్రచారం చేశారా ..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఈ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది నటులు పరిచయమయ్యారు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరు అని చెప్పవచ్చు. ఇక అల్లుడు శిరీష్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యారు కానీ ఏ ఒక్క సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నది. అల్లు శిరీష్ సినీ ఇండస్ట్రీకి మొదటిసారిగా బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా ఎన్నో చిత్రాలలో నటించిన అల్లు శిరీష్ 2013 లో గౌరవం అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు.

Chiru Launched Allu Studios
ఇక ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు అంటే సినిమాలలో నటించారు కానీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఈ హీరోకి అవకాశాలు కూడా అంతంత మాత్రమే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అవకాశాల కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నడు అల్లు శిరీష్. ఇక అల్లు శిరీష్ కేవలం నటుడు గానే కాకుండా ఒక పత్రిక ఎడిటర్ గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. సౌత్ స్కోప్ మాసపత్రికలో ఎడిటర్ గా చేశారు.

Megastar to launch Allu Studios
ఇక గీత ఆర్ట్స్ సంస్థ కోసం కో ప్రొడ్యూసర్ గా కూడా ఎన్నో పనులు చేశారు అల్లు శిరీష్. తన తండ్రి అల్లు అరవింద్ కూడా నిర్మాతగా సినీ నటుడుగా ఎన్నో సినిమాలలో నటించాడు. కానీ తన అన్న తండ్రి లాగా ఎదగలేకపోయారు శిరీష్. ఇక కొన్ని సినిమా ఫిలింఫేర్ ఫంక్షన్లకు కూడా హోస్టుగా వ్యవహరించారు. ఇక అల్లు శిరీష్ కెరియర్ మొదట్లో ఒక టీవీ ఛానల్ కూడా పెట్టాలనుకున్నాడు కానీ అది కుదరక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి అల్లు శిరీష్ తమ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను కేవలం ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది నిన్నటి రోజున అల్లు స్టూడియోను నిర్మించారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసినట్లుగా సమాచారం.

Share post:

Latest