ఆ సీనియర్ హీరోయిన్.. బాలయ్య సినిమా కోసం అంత డిమాండ్ చేసిందా..!

గత ఏడాది వచ్చిన అఖండ సినిమాతో బాలకృష్ణ సూపర్ హిట్ అందుకుని వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ ని ఈనెల 21న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ కి లేదా సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత హిట్ డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో తన 108వ సినిమాలో నటించబోతున్నాడు.

NBK 108 | 'NBK 108' updated with Thaman BGM..Video » Jstimesnow

ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా క్రేజీ ముద్దుగుమ్మ శ్రీ లీల కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా చెన్నై ముద్దుగుమ్మ త్రిషని తీసుకోవాలని అనుకుంటున్నారట.గత కొంతకాలంగా త్రిష తెలుగులో సినిమాలు చేయట్లేదు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ముందుగా త్రిషని తీసుకోవాలని అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల త్రిష ఈ సినిమాకు నో చెప్పింది.

After 5 Years, heroine Comes Back with Balayya Film! | cinejosh.com

తాజాగా మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ లో త్రిష నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో త్రిష కు తెలుగులో మళ్లీ అవకాశాలు క్యూ కొడుతున్నాయి. ఈ క్రమంలోనే అనిల్ రావుపూడి బాలయ్య సినిమాలో త్రిష హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక త్రిష బాలకృష్ణ జోడిగా ఇది వరకు లయ‌న్ సినిమా వచ్చింది. మళ్లీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారని తెలుస్తుంది. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా చేయడానికి భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఈ సినిమాకు ఏకంగా కోటి రూపాయల పైన భారీ రెమ్యూనరేషన్ అడిగినట్టు తెలుస్తుంది. మేకర్స్ త్రిషను కన్ఫామ్ చేస్తారా లేదా ..?వేరే హీరోయిన్ తీసుకొస్తారా..? అనేది ఇంకా తెలియాల్సి ఊంది.

Share post:

Latest