పైకి అందంగా కనిపించే ఈ స్నేహ..కెరీర్ లో సరిదిద్దుకోలేని తప్పు చేసిందా..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో అభినయంతో నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు హోంలీ బ్యూటీ గా పాపులర్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే అలాంటి టైం లోను ఏ మాత్రం తన హద్దులు మీరకుండా పద్ధతిగా రూల్స్ పెట్టుకుని చేసుకుంటూ ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న స్నేహ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత ఇష్టం.

మనకు తెలిసిందే స్నేహ అసలు పేరు సుహాసిని. సినిమాలోకి వచ్చాక స్నేహ గా మారింది .మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది . ఇక ఆ తర్వాత తెలుగులో అవకాశాలు అందుకుంటూ తెలుగు జనాలకు దగ్గర అయ్యింది. తెలుగు హీరోయిన్ గా పాపులర్ అయింది . ఈ క్రమంలోనే తెలుగులో ఆమె దాదాపు 15 సినిమాలకు పైగానే నటించింది. తమిళ్ లో ఏడు సినిమాలు నటించింది . తొలివలపు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన స్నేహ ..ప్రియమైన నీకు తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మహారధి, మధుమాసం, సంక్రాంతి. మీ సుఖమే నే కోరుకున్న, దట్ ఇస్ పాండు, వెంకీ, ఏవండోయ్ శ్రీవారు, రాధాగోపాలం, మనసు పలికే మౌనరాగం, ఆది ,విష్ణు, పాండురంగడు, సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ ..సినిమాలలో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది.

అయితే సినిమా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా గుడ్ నేమ్ తెచ్చుకున్న స్నేహ వ్యక్తిగతంగా మాత్రం తప్పటడుగులు వేసి జనాలు చేత బ్యాడ్ అనే పిలుపుకు కారణమైంది. మనకు తెలిసిందే స్నేహ.. ప్రసన్న అనే అబ్బాయిను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళ ప్రేమ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఈ కారణంగానే ప్రసన్నతో పెళ్లి వద్దు అంటూ స్నేహ తరుపు వాళ్ళు నానా రచ్చ చేశారట. అయినా కానీ సరే స్నేహ తనే కావాలి అంటూ మొండి పట్టుదల పట్టిందట . దాదాపు మూడేళ్లు పెళ్లి కోసం వెయిట్ చేసిన స్నేహ ఇక ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు అని తెలిసి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకునిందట .అంతేకాదు ఒక గుడిలో దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకుందట . అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎట్టకేలకు ఆమెను తీసుకువచ్చి ఘనంగా పెళ్లి చేశారంటూ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది .ఇంత పద్ధతిగా రోల్స్ చేసే స్నేహ లైఫ్ లో ఇలాంటి తప్పుడు డెసిషన్ తీసుకోవాలనుకున్నిందా అంటూ జనాలు ఆమెను తిట్టిపోసారు. ప్రజెంట్ ఇప్పుడు స్నేహ ప్రసన్నతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ పై కాన్సన్ట్రేషన్ చేసిన స్నేహ మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ మరో పక్క బుల్లితెరపై కూడా తన మార్కును చూపించబోతుంది.

Share post:

Latest