చిరంజీవి గారి కుటుంబంతో వచ్చిన చిక్కంతా అక్కడే: అల్లు అరవింద్

తెలుగు చిత్ర సీమలో మెగా కుటుంబం, అల్లు కుటుంబానిది ఒక ప్రత్యేకమైన, విడదీయలేని బంధం. డైరెక్ట్ గా బంధుత్వం ఉండటం కారణం చేత వారంతా ఒకే కుటుంబ సభ్యులుగానే మెలుగుతారు. దాని వెనక కధ అప్రస్తుతం, ఎందుకంటే వారి రిలేషన్స్ గురించి అందరికీ తెలిసినదే. పైగా ఒకప్పుడు వీరు ఇరువురినీ మెగా ఫ్యామిలీ కిందే లెక్కకట్టేవారు. ఈమధ్య కాలంలో కాస్త మార్పు రావడంతో ‘అల్లు కుటుంబం’ గురించి ప్రత్యేకంగా వినబడుతోంది. ఈ విషయంలో బయట అనేక రూమర్స్ వినబడుతున్నాయి.

దానికి కారణం అల్లు అర్జున్ అని ఓ వర్గం అంటే, ఓ వర్గం దానికి కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. ఇక లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ, సోషల్ మీడియాలో మాత్రం పలు రకాలుగా వదంతులు పుట్టుకొస్తున్నాయి. ఇకపోతే ఇరు కుటుంబాలలో పోటీతత్వం అనేది బాగా నెలకొంది అనే విషయం అందరికీ తెలిసినదే. ఇకపోతే ఆ పోటీ తత్త్వం అనేది ప్రధానంగా రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ మధ్యన ఏర్పడిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య తరుచు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉంటాయో మన అందరికి తెలిసిందే.

ఇకపోతే ఈ విషయంలో ఓ మీడియా వేదికగా అల్లు అరవింద్ కొన్ని ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించాడు. అరవింద్ మాట్లాడుతూ.. “చిరంజీవి నేను కొన్ని దశాబ్దాల నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికీ పండగ వస్తే మా కుటుంబం మొత్తం చిరంజీవి గారి ఇంటికి వెళ్లి సంబరాలు చేసుకుంటాము. అయితే మా ఇంట్లో జరిగే ఇలాంటి విషయాలను మేము బహిర్గతం చేయలేము కదా. ఒకే రంగం లో ఉంటున్నాం కాబట్టి కాస్త పోటీ తత్త్వం అనేది ఉండడం సహజం. ఎవరి సినిమా వారికి గొప్ప.. ఎవరి కష్టం వారిది..” అంటూ పోటీ వుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.