అమర్నాథ్‌కు లైన్ క్లియర్..టార్గెట్ పెద్దదే..!

ఈ సారి గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సారి గాని గెలవకపోతే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు నాయకులని సైతం యాక్టివ్ గా ఉంచుతూ..వైసీపీకి ధీటుగా పనిచేసేలా చేస్తున్నారు.

ఇదే క్రమంలో వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ భేటీ అయ్యి..పార్టీ పటిష్టతపై చర్చలు చేస్తున్నారు. ఈ సమావేశంలో కొందరు ఇంచార్జ్‌లకు ఇంకా బాగా పనిచేయాలని చెబుతుండగా, మరికొందరికి భారీ మెజారిటీలతో గెలవాలని చెబుతున్నారు. అంటే బాగా పనిచేయాలని చెప్పేవారికి సీటు కన్ఫామ్ కాదని చెప్పొచ్చు. అదే భారీ మెజారిటీతో గెలవాలని చెప్పారంటే..ఖచ్చితంగా వారికి సీటు ఫిక్స్ అని చెప్పొచ్చు. ఇప్పటికే పలువురు ఇంచార్జ్‌లకు భారీ మెజారిటీ టార్గెట్ ఇచ్చారు.

దూకుడు పెంచండి

తాజాగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి కూడా భారీ మెజారిటీ టార్గెట్ గా పెట్టారు. ఈయన పలమనేరు ఇంచార్జ్‌గా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈయన భారీ మెజారిటీ తేడాతో ఓటమి పాలయ్యారు. పలమనేరు నుంచి వైసీపీ తరుపున వెంకట్ గౌడ విజయం సాధించారు. తొలిసారి పోటీ చేసే జగన్ గాలిలో గెలిచేశారు. ఇలా గెలిచిన వెంకట్ పలమనేరులో పెద్దగా అభివృద్ధి చేసింది లేదు..ప్రజలకు అండగా ఉండే కార్యక్రమాలు తక్కువ..వివాదాల్లో ఎక్కువ. దీంతో ఎమ్మెల్యేపై నెగిటివ్ ఎక్కువ ఉంది.

ఇక ఇటు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న అమర్నాథ్..దూకుడుగా పనిచేస్తున్నారు..ఓ సీనియర్ నేతగా తన అనుభవంతో ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యారు. అనూహ్యంగా పలమనేరులో పుంజుకున్నారు. ఈయనకు గెలుపు అవకాశాలు మెరుగయ్యాయి. అందుకే ఈ సారి భారీ మెజారిటీతో గెలవాలని చెప్పి చంద్రబాబు, అమర్నాథ్‌కు టార్గెట్ పెట్టారు. అలాగే జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. మరి బాబు టార్గెట్ అమర్నాథ్ రీచ్ అవుతారో లేదో చూడాలి.