నందమూరి బాలయ్యకి అదొక్కటే తక్కువైంది!

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 62 ఏళ్లలో కూడా బాలయ్య దుమ్ము దులుపుతున్నాడు. ఇక నందమూరి ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. బాలయ్య సినిమా వచ్చిందంటే సినిమా హాళ్లలో మంటలు చెలరేగాల్సిందే. డై హార్ట్ ఫ్యాన్స్ ఆయన సొంతం. కొన్ని దశాబ్దాలుగా బాలకృష్ణ తెలుగు పరిశ్రమలో టాప్ స్టార్స్ వరసలో కొనసాగుతున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ప్రముఖ OTT ఆహాలో ప్రసరమౌతున్న ‘Unstoppable’ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే.

ఇకపోతే ఈ షో రికార్డ్స్ సృష్టిస్తున్న సంగతి తెలిసినదే. ఇండియాలో ప్రసారం అవుతున్న రియాలిటీ షోస్ అన్నింటిలోకెల్లా దీనిదే ప్రధమ స్థానం అని ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB తాజాగా పేర్కొందంటే అర్ధం చేసుకోండి. బాలయ్య స్టామినా ఏమిటో. ఇకపోతే ఆయనకున్న స్టార్డం వలన ఒకప్పుడు అనేక వ్యాపార సంస్థలు ప్రచారం కోసం అతని వెంటబడేవి. అయితే బాలయ్య ఆ ఆఫర్స్ ని తిరస్కరించేవాడు. కాగా ఏళ్లుగా పాటిస్తున్న ఈ నియమాన్ని బాలకృష్ణ తాజాగా బ్రేక్ చేసిన విషయం తెలిసినదే. ఈ విషయంలో నందమూరి అభిమానులు కాస్త నిరాశగా ఉండేవారు. కాగా వారి ఆశయం నేడు నెరవేరింది.

సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ బ్రాండ్ అంబాసడర్ గా బాలయ్య బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి రిలీజవ్వగా అది కూడా రికార్డ్స్ వ్యూస్ తో దూసుకెళుతోంది. ఇక బాలయ్యకు తిరుగేలేదు అన్నమాదిరి బాలయ్య ఏది పట్టినా అది బంగారంలాగా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయంలో మందమూరి ఫ్యాన్స్ ఖుషీగా వున్నారు. ఇకపోతే సినిమాల విషయానికొస్తే బాలయ్య ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్ సిద్ధం చేశారు. వీరసింహారెడ్డి రూపంలో వారిని అలరించనున్నారు.