కమెడియన్ అలీపై నిప్పులు చెరిగిన అల్లు అరవింద్.. మెగా ఫ్యామిలీ కారణమా? 

తెలుగు కమెడియన్ ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. ‘అలీతో సరదాగా’ అనే షోకి ఆలీ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ కార్యక్రమంలో భాగంగా అనేకమంది సెలెబ్రిటీలు షోకి అతిథులుగా హాజరవుతూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలని అలీతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ హాజరయ్యారు. కాగా ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇకపోతే అక్టోబర్ 10న కంప్లీట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇటీవలే అల్లు రామలింగయ్య 100వ జయంతి కార్యక్రమాలు జరిగిన సంగతి విదితమే. అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ స్టూడియో కూడా లాంచ్ చేయడం.. చిరంజీవి అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తాను అల్లు రామలింగయ్య గారితో కొడుకుగా 22 సినిమాల్లో నటించానని అలీ చెబితే.. అల్లు అరవింద్ ఆశ్చర్యపోయారు. మీరు పెద్ద కొడుకు అయితే నేను రెండవ కొడుకు అని అలీ అన్నారు. దాంతో అలీ ఇప్పుడు ఆస్తిలో వాటా ఏమన్నా అడుగుతున్నావా అని సరదాగా ప్రశ్నించారు.

ఆ సంగతి అటుంచితే, ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి చిన్న డిస్ట్రబెన్స్ వచ్చింది అంటూ అలీ ప్రస్తావించగా అల్లు అరవింద్ ఫైర్ అయ్యారు. అలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కాట్రవర్సీ ప్రశ్నలు ఆడుతాం అంటే ముందే చెప్పమని చెప్పాను. కాంట్రవర్సీ ఉండదు సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఉంటాయి అని చెప్పారు. మరి ఇదేంటి అంటూ అల్లు అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. దీని గురించి వీరి మధ్య పూర్తి సంభాషణ ఎలా జరిగిందో తెలియాలంటే అక్టోబర్ 10 వరకు వెయిట్ చేయాలి.

Share post:

Latest