షాకింగ్: ఎవరు ఊహించని ట్విస్ట్.. రాజమౌళి మహేష్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్ దిగ్గ‌జ దర్శకుడు రాజమౌళి ఇండియాలో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు.. రాజమౌళి ఈ సంవత్సరం ప్రథమంలో త్రిబుల్ ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా ఎంతో కాలంగా రాజమౌళితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమాలో బిజీ అవునన్నాడు.

SS Rajamouli compares next film with Mahesh Babu to James Bond, Indiana  Jones - Hindustan Times

మహేష్ బాబు రాజమౌళి సినిమాకు కథ అందిస్తున్న దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈయన ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను నిజజీవితంలో జరిగిన ఓ యువకుడికి సంబంధించిన కథకు దగ్గరగా ఉంటుందని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమాను రాజమౌళి రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Share post:

Latest