అనసూయ కు ఘోర అవమానం..షర్ట్ చిరిగిపోయి..అయ్యయ్యో!!

సోషల్ మీడియాలో ఎప్పుడు వినిపిస్తున్న పేర్లలలో అనసూయ పేరు కూడా ఒకటి. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్ అనసూయ.. ఈ మధ్యకాలంలో ఆమె ఏం మాట్లాడినా అది కాంట్రవర్షల్ గా మారిపోతుంది . లైగర్ సినిమా టైంలో పరోక్షకంగా విజయ్ దేవరకొండ పై ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురైన అనసూయ.. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన అవమానం గురించి అభిమానులకు తెలియజేసి బాధపడింది . ఈ క్రమంలోనే అనసూయ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తనకి ఆనందం వచ్చిన …బాధ వచ్చిన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే అనసూయ రీసెంట్గా తన ఇన్స్టా స్టోరీలో ..తాను పడిన ఇబ్బందుల గురించి వివరించింది. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఆమెకు ఇబ్బందికర సంఘటన ఎదురైందని ..దాని కారణంగా ఆమె షర్ట్ కూడా చిరిగిపోయిందని సంచలన విషయాలు బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా అనసూయ పోస్ట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . విమానంలో బెంగళూరు నుండి హైదరాబాద్ కు బయలుదేరిన అనసూయ కుటుంబం ..ఓ ఎయిర్ లైన్స్ తో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించుకున్నారట.

కాగా టికెట్ లో ఉన్న సమయం కంటే ముందుగానే ఎయిర్పోర్ట్ కి రావాలని సదరు ఎయిర్లైన్స్ సంస్థ వారికి ముందే చెప్పారట. అయితే ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్కులు లేవని లోపలికి పంపించలేదట. దీంతో మాస్కులు ధరించి ఫ్లైట్ లోపలికి వెళ్ళగా సీట్లు ఒకచోట కాకుండా అక్కడక్కడ కేటాయించారని ఆమె చెప్పుకొచ్చింది . అంతేకాదు వాళ్లు సీట్లు వరుసగా బుక్ చేసుకున్నారట ..అయినా గాని వేరువేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగిన అక్కడి యాజమాన్యం స్పందించలేదట.

దీంతో ఫైర్ అయిపోయిన అనసూయ తనను తాను కంట్రోల్ చేసుకొని సీట్లో కూర్చునిందట. అయితే అనసూయ కూర్చున్న సీట్ అస్సలు బాగోలేదట . దీని కారణంగా ఆమె వేసుకున్న షర్ట్ కూడా చిరిగిపోయింది అని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంత డబ్బులు పెట్టి టికెట్ బుక్ చేయించుకుంటే కనీసం సదుపాయాలు కూడా లేవని ఆమెపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ప్రస్తుతం అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ వైరల్ గా మారింది . దీనిపై కొందరు అనసూయను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు . మరి చూడాలి దీనిపై ఆ ఎయిర్ లైన్ సంస్థ ఏమైనా స్పందిస్తుందో లేదో../