రాజధాని రచ్చ: ఎవరికి ఉపయోగం..!

గత మూడేళ్లుగా ఏపీ రాజధాని విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది…అధికారంలో ఉన్న వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది…ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం ఒకే రాజధాని అది కూడా అమరావతి అంటుంది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. అయితే మూడేళ్ళ నుంచి రాజధానిపై రాజకీయంగా రగడ నడుస్తోంది.

ఇంకా ఈ రచ్చలో ఎవరికి ఉపయోగం జరుగుతుందంటే…పార్టీలకే అని చెప్పొచ్చు. ఈ రచ్చ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. విడిపోయిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించకపోవడం…విధివిధానాలు సరిగ్గా లేకపోవడం, తాత్కాలిక భవనాలు అంటూ హడావిడి చేయడం వల్ల…అమరావతి సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. సరే చంద్రబాబు కొద్దో గొప్పో చేశారు…జగన్ వచ్చాక రాజధాని పనులు పరుగెడతాయి.

 

జగన్ హయాంలోనే రాజధాని పనులు పూర్తి అయ్యి, ఏపీకి కంటూ ఓ రాజధాని ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ జగన్ అనూహ్యంగా మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని చెప్పి మూడు రాజధానులు ప్రకటించారు. అభివృద్ధి చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. కానీ రాజధానుల ద్వారానే అభివృద్ధి అని చెప్పి జగన్…ఆ దిశగా ముందుకెళ్లారు. ఇటు ఒకే రాజధాని నినాదంతో ఉన్న టీడీపీ, అమరావతి రైతులు…దీనిపై కోర్టుకు వెళ్ళి బ్రేకులు వేశారు.

ఇక మూడు రాజధానుల బిల్లు కూడా తప్పులు ఉండటంతో, ఆ బిల్లుని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మళ్ళీ కొత్త బిల్లుతో ముందుకొస్తామని అంటుంది. ఇటు టీడీపీ ఒకే రాజధాని ఉంటుందని చెబుతుంది. వైసీపీ ఏమో మూడు అంటుంది. ఇలా రెండు పార్టీల మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ఇక మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి…ఈలోపు మూడు రాజధానులు ఎప్పుడు అవుతాయి. ఒకవేళ ఇప్పుడు మూడు రాజధానులు పెట్టిన జనం నమ్మే పరిస్తితిలో ఉండరు. అంటే ఇటు అమరావతి కాకుండా, అటు విశాఖ కాకుండా…అసలు ఏపీకి రాజధాని లేకుండా పోయింది. రెండు పార్టీల పోలిటికల్ డ్రామా తప్ప..ఇందులో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు.

Share post:

Latest