అమరావతికి వైసీపీ నేతలే ప్లస్…!

అమరావతి..ఏపీ రాజధాని..వైసీపీ ప్రభుత్వం అలా చెప్పుకోవడం లేదు గాని…ప్రస్తుతానికి ఏపీకి మరో రాజధాని లేదు. గత చంద్రబాబు ప్రభుత్వం…అన్నీ ప్రాంతాలకు మధ్యలో ఉంటుందని చెప్పి..అమరావతిని రాజధానిగా పెట్టింది…దీనికి ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఓకే చెప్పారు. సరే చంద్రబాబు హయాంలో అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి అవ్వలేదు. అలాగే అక్కడ పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

ఇక ఇదే సాకుతో అధికారంలోకి వచ్చిన జగన్…మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అమరావతికి వేల కోట్లు పెట్టాలని, అలాగే ముంపు ప్రాంతమని చెప్పి…రాజధాని విశాఖకు షిఫ్ట్ చేయాలని అనుకున్నారు. కానీ మూడు రాజధానుల బిల్లులో తప్పిదాలు, అమరావతి రైతుల పోరాటం, పలు న్యాయ సమస్యలతో మూడు రాజధానుల బిల్లుని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే మళ్ళీ కొత్త బిల్లుతో ముందుకొస్తామని చెబుతుంది.

సరే వీరు బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు గాని..అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ప్రాంతం తమ పోరాటం ఆపడం లేదు. వైసీపీ ఎన్ని రకాలుగా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూసిన సరే…అమరావతి ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ఇక అమరావతిపై వైసీపీ నేతలు ఏ స్థాయిలో విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. తాజాగా అమరావతి ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే క్రమంలో అమరావతి నుంచి అరసవెల్లి వరకు రైతులు, ప్రజలు పాదయాత్ర చేయడానికిర్ రెడీ అయ్యారు.

ఈ పాదయాత్రపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు…ఇది పాదయాత్ర కాదని, ఉత్తరాంధ్రపై దండయాత్ర అని, ఈ యాత్రని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని అంటున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సైతం.. అమరావతి నుంచి అరసవిల్లి వరకు చేపట్టేది పాదయాత్ర కాదని.. ఉన్మాద యాత్ర అని, అసమర్థుల అంతిమయాత్ర అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

మామూలుగా అయితే అమరావతి ప్రజలు వారి దారిలో వారు వెళ్తారు. కానీ వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి…అమరావతిపై ఇంకా సానుభూతి పెరిగేలా చేస్తున్నారు. అసలు పట్టించుకోకుంద ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు…ఇలా అడ్డుకుంటాం..అంతిమ యాత్ర అనడం వల్ల పరోక్షంగా అమరావతిని వైసీపీ నేతలే హైలైట్ చేస్తున్నారు.

Share post:

Latest