ఆ కంచుకోటల్లో వైసీపీకి రిస్క్?

గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు బాగా మారాయి…ఆ ఎన్నికల్లో ఏ జిల్లా చూసిన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్తితి…కానీ ఇప్పుడు సీన్ మారిపోతూ వస్తుంది..ఇప్పుడు చాలా జిల్లాల్లో వైసీపీకి రిస్క్ పెరుగుతుంది. ఆఖరికి వైసీపీ కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లో కూడా పరిస్తితులు మారుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరులో కూడా సీన్ మారిపోతూ వస్తుంది.

గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి కనిపించడం లేదు..ఇక్కడ కొన్ని చోట్ల టీడీపీ పుంజుకుందని లేటెస్ట్ ఆత్మసాక్షి సర్వేలో తేలింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 5, టీడీపీ 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, రెండు చోట్ల పోటాపోటీ వాతావరణం ఉందని చెప్పింది. నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్ళూరుపేట, ఆత్మకూరు సీట్లలో వైసీపీకి…. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి సీట్లలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి.

ఇక కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..కావలి, నెల్లూరు సిటీల్లో వరుసగా వైసీపీ రెండుసార్లు గెలిచింది. అలాంటి సీట్లు ఇప్పుడు టీడీపీ ఖాతాలోకి వెళ్తాయని చెబుతున్నారు. అలాగే టఫ్ ఫైట్ ఉన్న కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి గడ్డు పరిస్తితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదో 2-3 శాతం డిఫరెన్స్‌తో ఈ రెండు చోట్ల వైసీపీ ఎడ్జ్‌లో ఉందని తెలుస్తోంది.

కానీ ఎన్నికల్లోపు పరిస్తితులు మారిపోవచ్చు. వైసీపీకి బలం పెరిగితే ఇబ్బంది లేదు…అలా కాకుండా తగ్గితేనే రిస్క్. మరి వైసీపీ బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే చెప్పలేని పరిస్తితి. అటు ఆనం రామ్ నారాయణరెడ్డి గాని టీడీపీ వైపు వస్తే వెంకటగిరిలో రాజకీయం మారే ఛాన్స్ ఉంది. మొత్తానికి కంచుకోటలో వైసీపీకి రిస్క్ ఎక్కువ ఉంది.

Share post:

Latest