బాలయ్య వారసుడితో రొమాన్స్ కి సిద్ధమవుతున్న యంగ్ హీరోయిన్..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఒక స్థానానికి చేరుకున్న తర్వాత .. ఆ తర్వాత తరంగా తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటివాళ్ళు నాగార్జున , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే.. ఇక వీరు కూడా వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఇక నాగార్జున ముందుగానే నాగచైతన్య , అఖిల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. వీరు తమ టాలెంట్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బాలకృష్ణ కూడా త్వరలోనే తన కొడుకు మోక్షజ్ఞను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మోక్షజ్ఞ ఎప్పుడో ఇండస్ట్రీలోకి రావాల్సి ఉంది.. కానీ చదువు కారణంగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఇప్పుడు నటనలో కూడా శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నాడు.

Mokshagna: 'పవన్ కళ్యాణ్' డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా.. బాలయ్య గ్రీన్  సిగ్నల్ - OK Telugu

బాలకృష్ణ తన కొడుకును ఇండస్ట్రీలోకి గ్రాండ్గా పరిచయం చేయడానికి పెద్ద డైరెక్టర్లను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక క్రియేటివ్ డైరెక్టర్ కథ సిద్ధం చేసి ఇవ్వగా.. త్వరలోనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్గా మోక్షజ్ఞ సరసన ఎవరు నటించబోతున్నారు అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. నిజానికి ప్రస్తుతం పాపులర్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శ్రీ లీలా అయితే మోక్షజ్ఞ సరసన నటించడానికి బాగుంటుందని, వీరి జోడి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందని కూడా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ కూడా తన ఫిట్నెస్ ను పెంచుకునే పనిలో ఉన్నారట.

Sree Leela (Actress) Biography, Wiki, Age, Height, Career, Family, Awards  and Many More

నిజానికి శ్రీ లీలా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య కీలకపాత్రలో నటిస్తున్న సినిమాలో బాలయ్యకు కూతురు పాత్రలో నటించబోతోంది. ఇక అక్కడ ఈమె ముఖ కవళికలు , అందం ,అభినయం అన్నీ నచ్చే ఆ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట బాలకృష్ణ. శ్రీ లీలా కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్త వైరల్ గా మారుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాల్సి ఉంది. కానీ ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest