చ‌క్రం తిప్పిన వైసీపీ మంత్రి…. వాళ్ల గేమ్ ప్లాన్ రివ‌ర్స్‌…!

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్నాళ్లుగా ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా సీపీఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని.. గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చార‌ని.. ఉపాధ్యాయులు , ఉద్యోగులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో తాము పొర‌పాటు చేశామ‌ని.. తెలియ‌క హామీ ఇచ్చామని.. స‌ర్కారు ఒప్పుకుంది. సీపీఎస్ ర‌ద్దుచేయ‌క‌పోయినా.. దీనికి బ‌దులుగా జీపీఎస్‌ను తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క టించింది. అయిన‌ప్ప‌టికీ.. ఉద్యోగులు స‌సేమిరా అన్నారు.

Disappointed with Jagan, Botsa to leave YSRCP! - TeluguBulletin.com

ఇటీవ‌ల సెప్టెంబ‌రు 1న విజ‌య‌వాడ‌లో మిలియ‌న్ మార్చ్‌, సీఎం ఇంటి ముట్ట‌డికి పిలుపునిచ్చారు. అయి తే.. దీనిని ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చేసింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఉపాధ్యాయులు.. రాష్ట్ర వ్యాప్తంగా గురు పూజా దినోత్స‌వాన్ని బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిచ్చారు. దీనిని ముందుగానే గ్ర‌హించిన వైసీపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నే వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ద‌ఫా 176 మంది ఉపాధ్యాయు ల‌ను అవార్డుల‌కు ఎంపిక చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసింది.

ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేతుల మీదుగా అవార్డుల‌ను అందించాల‌ని నిర్న‌యించారు. చివ‌రి నిముషంలో ఉపాధ్యాయులు ఈ కార్య‌క్ర‌మాన్ని బ‌హిష్క‌రిస్తే.. ప్ర‌భుత్వం అభాసుపాల‌వుతుంద‌ని.. అంద‌రూ అనుకున్నారు. అయితే..ఈ క్ర‌మంలో నే మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చ‌క్రం తిప్పారు. వైసీపీకి అనుబం ధంగా ఉన్న ఉపాధ్యాయుల‌ను రాత్రికిరాత్రి రంగంలోకి దింపి.. అవార్డు గ్ర‌హీత‌లైన వారికి క‌బురు పంపించారు. దీంతో వారంతా.. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు.

Botsa Satyanarayana - Alchetron, The Free Social Encyclopedia

ఫ‌లితంగా.. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ గురుపూజా కార్య‌క్ర‌మం ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగిపోయింది. అయితే.. ఈ కార్య‌క్ర‌మం విజ‌యం కావ‌డంతో ఇక‌, ఉపాధ్యాయుల డిమాండ్లు ప‌క్క‌కు పోయిన‌ట్టేనా.. వారు ఇక‌, సైలెంట్ అవుతారా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. గురు పూజాదినోత్స‌వాన్ని బ‌హిష్క‌రించి.. ప్ర‌భుత్వానికి షాక్ ఇవ్వాల‌ని అనుకున్నారు. కానీ, అది స‌క్సెస్ కావ‌డం.. మంత్రి బొత్స చక్రం తిప్ప‌డంతో ఇప్పుడు ఏం చేయాల‌నేది ఉపాధ్యాయులకు పెద్ద ప్ర‌శ్న‌గా మారిపోయింది.

Share post:

Latest