ఆ స్టార్ దర్శకులిద్దరూ నెక్స్ట్ సినిమాతోనైనా ప్రూవ్ చేసుకుంటారా?

సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు తలకిందులైతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఇక్కడ నటీనటులు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కెరీర్ అనేది సక్సెస్ మీదనే ఆధారపడి నడుస్తుంది. హిట్లు ఉన్నప్పుడు మోసినవారే.. ప్లాప్స్ వచ్చినప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తూ వుంటారు. ఇక్కడ విజయాలు పరాజయాలు శాశ్వితం కానే కాదు. వరుస హిట్లు కొట్టినవారైనా ఒక్క ప్లాప్ ఇచ్చారంటే ఇక అంతేసంగతి. ప్లాపుల్లో ఉన్నవారు ఒక సక్సెస్ పడితే పైకి లేచి కూర్చుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే..

టాలీవుడ్ లో ప్రస్తుతం ఇద్దరు అగ్ర దర్శకులకు అర్జెంట్ గా హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు డైరెక్ట్ చేసిన సినిమాలు తాజాగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలవడంతో కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా నెగెటివిటీని ఫేస్ చేయాల్సి వస్తోంది. వాళ్ళెవరో కాదు కొరటాల శివ మరియు పూరీ జగన్నాథ్. అవును.. గతేడాది వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎదురుగని దర్శకుడిగా కొనసాగారు కొరటాల శివ. కమర్షియల్ కంటెంట్ కు తనదైన శైలిలో సందేశాన్ని జోడిస్తూ వరుస హిట్లు అందుకున్నాడు.

ఇలాంటి డైరెక్టర్ మెగా తండ్రీకొడుకులు చిరంజీవి మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ”ఆచార్య” చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్లాప్ అయ్యారు. పేలకమైన కంటెంట్ తో బలహీనమైన క్యారక్టరైజేష్ తో ప్రేక్షకులను ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం విదితమే. దీని దెబ్బకు కొరటాల ఎప్పుడూ లేనంత ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పిలవబడే పూరీ జగన్నాథ్ ”లైగర్” సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు పూర్తీ ఈ సినిమాతో ఖంగు తిన్నాడు. పైగా రౌడీ అభిమానులు కాస్త గుర్రుగా వున్నారు. నెక్స్ట్ సినిమా ‘జనగణమన’ సినిమానైనా సరిగ్గా తీయమని ప్రేక్షకులు వేడుకుంటున్నారు.