చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్ అయ్యేనా..?

చిరంజీవి గత నటించిన చిత్రం ఆచార్య ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులు కాస్త నిరాశ పడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. ఈ సినిమా కొన్న బయ్యర్లకు భారీ నష్టాలను కూడా మిగిల్చాయి.అయితే ప్రస్తుతం చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా కొనడానికి బయర్లు సైతం కాస్త ఆలోచిస్తున్నారు అనే వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమా మలయాళం లూసిఫర్ సినిమా కావడమే.. కాకుండా ఈ సినిమా ఆల్రెడీ ఓటీటి లో తెలుగులో కూడా విడుదలవ్వడం జరిగింది.

Godfather OTT Partner revealed గాడ్ ఫాదర్ ఓటిటి పార్ట్‌నర్ రివీల్డ్
ఇక ఇదే చిత్రాన్ని చిరంజీవి రీమిక్స్ చేయడంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇ చిత్రంలో పూరి జగన్నాథ్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ,నయనతార, సత్యదేవ్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని కొనిదెల బ్యానర్ పైనే నిర్మించడం జరిగింది. ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో అధికారికంగా తెలియజేయడం జరిగింది. ఇక బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటున్నాయి కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం డిజాస్టర్ గా మిగులుతున్నాయి.

Should Chiranjeevi's 'Godfather' Opt for a direct release on Netflix?
ఇక ఇలాంటి సమయంలోనే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా బాలీవుడ్ లో రీమిక్స్ చేసి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్ర బృందం. కానీ బాలీవుడ్లో మెగాస్టార్ కు అంత క్రేజ్ లేదని కూడా చెప్పవచ్చు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో నటిస్తున్నప్పటికీ.. ఒకవేళ ఈ సినిమా సల్మాన్ ఖాన్ క్రేజీ వల్ల ఆకట్టుకుంటే ఆకట్టుకోవాలి లేదంటే ఈ సినిమాని చిరంజీవి బాలీవుడ్ లో విడుదల చేయడం వల్ల వర్కౌట్ కాదని కోంత మంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Share post:

Latest