రవితేజ చేసినప్పుడు లేనిది.. రానా చేస్తే తప్పొచ్చిందా.. ఫ్యాన్స్ ఫైర్.!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ డిజాస్టర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే ఈయన నటించిన ఎన్నో సినిమాలు డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే.. రవితేజ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్న నేపథ్యంలో రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలు సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈయన నటిస్తున్న ధమాకా ,టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే రవితేజ , శ్రీ లీలా ధమాకా సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. కూతురు వయసున్న అమ్మాయితో రవితేజ లిప్ లాక్ సన్నివేశాలు చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.Who Made Ravi Teja Say Yes To Kissing Scene?

ఇదిలా ఉండగా రానా ప్రస్తుతం రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తుండగా.. ఇందులో రానా లిప్ లాక్ సన్నివేశంలో నటించడం గమనార్హం. ఇక పెళ్లయిన తర్వాత లిప్ లాక్ సీన్లలో నటించడం గురించి కొంతమంది విమర్శలు చేస్తుండగా.. రానా అభిమానులు ఈ విషయంపై ధీటుగా బదిలిస్తున్నారు.. వయసు ముదిరిన రవితేజ లిప్ లాక్ సన్నివేశాలలో నటిస్తే తప్పులేదు కానీ .. యంగ్ హీరో అయి ఉండి రానా నటిస్తే మాత్రం తప్పు వచ్చిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కథ డిమాండ్ చేస్తే మాత్రమే రానా అలాంటి సన్నివేశాలలో నటిస్తారని కొంతమంది చెబుతున్నారు.Telugu Dhamaka, Lip Lock, Rana, Rana Daggubati, Rana Lip Lock, Rana Web, Raviteja, Sri Leela, Venkatesh-Movieమరి రానా నాయుడు వెబ్ సిరీస్ తో రానా సక్సెస్ అందుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. ఇకపోతే బాహుబలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాణా ఇటీవల విడుదలైన రాణా నాయుడు టీజర్ కి కూడా మంచి పాజిటివ్ రెస్పాండ్ వచ్చింది. ఇక కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest