బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం వెనుక ఆ సినిమా హస్తం ఉందా..?

స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదటి భార్య స్వర్గీయ బసవతారకం పేరు మీద హైదరాబాదులో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించిన విషయం తెలిసిందే.. నేడు ఈ హాస్పిటల్ ద్వారా సెలబ్రిటీలే కాదు కొన్ని లక్షల మంది సామాన్యులు కూడా ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు.. ప్రస్తుతం ఈ హాస్పిటల్ యొక్క నిర్వహణ బాధ్యతలను వారి సుపుత్రుడు నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ బసవతారకం హాస్పిటల్ నిర్మాణం వెనుక ఒక పెద్ద కథ జరిగింది. దాని గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..Unravelling the enigmaతెలుగు ప్రజల ఆరాధ్య దేవంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ,తమిళ్, హిందీ భాషలలో కలుపుకొని సుమారుగా 400 చిత్రాలలో నటించారు. ముఖ్యంగా 13 చారిత్రక చిత్రాలలో.. 55 జానపద.. 186 సాంఘిక.. 44 పౌరాణిక చిత్రాలలో నటించిన ఈయన .. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కెరియర్ లోనే ముఖ్యమైన సినిమా మేజర్ చంద్రకాంత్ .. అంతే కాదు ఈ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈయన ఈ సినిమాతోనే కోటి రూపాయల పారితోషకం తీసుకొని రికార్డు సృష్టించారు.. ఈ సినిమా డబ్బులను ఆయన తన సొంత లాభం కోసం ఉపయోగించుకోకపోవడం గమనార్హం.Major Chandrakanth@28Years: 28 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్, మోహన్  బాబుల 'మేజర్ చంద్రకాంత్'.. సాధించిన రికార్డులు ఇవే.. | Major Chandrakanth  Senior NTR Mohan Babu manchu ...

తాను నటించే సినిమా ఒక మంచి ఆశయాన్ని నిర్వర్తించడానికి పునాది కావాలని ఆలోచించినాయన ఇలా మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించారు. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈయన క్రమక్రమంగా సినిమాలను తగ్గిస్తూ వచ్చారు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏడు సంవత్సరాల పాటూ కొనసాగిన తర్వాత.. కేవలం నాలుగు సినిమాల్లోనే నటించడం జరిగింది. ఇక బ్రహ్మశ్రీ విశ్వామిత్ర , సామ్రాట్ అశోక్ వంటి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అప్పుడే ఎన్టీఆర్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. బసవతారకం పేరుతో ఒక క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు. అలా నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా నేడు కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడుకుంటున్నారు.