వినుకొండ సీటు ఫిక్స్..గెలుపు కూడా..!

గతంతో పోలిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు బాగా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాభవం కావొచ్చు..ప్రతిపక్షంలోకి వచ్చాక అధికార వైసీపీ అణిచివేసే కార్యక్రమాలు చేయడం కావొచ్చు..మొత్తానికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు వయసు మీద పడుతున్న కొద్దీ ఇంకా దూకుడుగా పనిచేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే..టీడీపీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.

పనిచేయని నేతలకు క్లాస్ పీకుతూనే..పనిచేసే నేతలకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైతే ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారో వారికి ఇప్పటి నుంచే సీట్లు ఫిక్స్ చేసేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నేతలకు సీట్లు ఫిక్స్ చేశారు. అలాగే ఇటీవల వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ…వారికి పలు సూచనలు చేసి…బాగా పనిచేసే వారికి సీటు ఫిక్స్ చేస్తున్నారు. ఇటీవల జగ్గయ్యపేట సీటు శ్రీరామ్ తాతయ్యకు ఫిక్స్ చేశారు. తాజాగా బాబు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో భేటీ అయ్యారు.

అలాగే నియోజకవర్గంలో పరిస్తితులని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బాగా పనిచేస్తున్న జీవీని బాబు ప్రశంసించారు. సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే వినుకొండని 4వ స్థానంలో నిలిపింనందుకు, బాదుడేబాదుడు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించినందుకు అభినందించారు. ఇక సీటు కూడా కన్ఫామ్ చేసేశారు. వినుకొండ నియోజకవర్గంలో జీవీ ఆంజనేయులు గెలుపు ఖాయమని, అన్నీ సర్వేలు అనుకూలంగా ఉన్నాయని, భారీ మెజార్టీతో గెలుపొందాలని బాబు సూచించారు. నేతలని, కార్యకర్తలని కలుపుని పనిచేయాలని తెలిపారు.

అయితే ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో వినుకొండలో టీడీపీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడుపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అసలు సొంత పార్టీలోనే బొల్లాపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొత్తానికి చూసుకుంటే వినుకొండలో జీవీకి గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే బాబు కూడా జీవీకి సీటు ఫిక్స్ చేసేశారు.

Share post:

Latest