అన్ స్టాపబుల్.. షో కి పవన్ రాకపోవడానికి కారణం ఇదేనా..?

గత కొన్ని రోజులుగా బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ -2 షో ప్రారంభం అవుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే బాలయ్య పవన్ కళ్యాణ్ ఓకే స్క్రీన్ పై చూడబోతున్నామని ఆయన అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే బాలయ్య కు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చారనే వార్త తాజాగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ -2 షో కి పవన్ హాజరు కాలేకపోతున్నట్లుగా సమాచారం.

Watch Unstoppable Web Series Online in HD Quality - Aha
అయితే పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికాలో ఉన్నారు. ఇంకా పది రోజులు కూడా పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నట్లుగా సమాచారం. అందుచేతనే పవన్ కళ్యాణ్ ఈ షోకు హాజరు కాలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ షో కి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపని నేపథ్యంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ షో కి పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారో లేదో అనే విషయంపై ఆహా సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. అయితే ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం కాస్త నిరుత్సాహ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

Pawan, Balakrishna Sweet Memory Goes Viral | cinejosh.com
ఇక మరొకవైపు పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు తన రేంజ్ను పెంచుకుంటూ వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరవాల్లు సినిమాని తలకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో నిధి అగర్వాల్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి కానీ ఈ సినిమాలో షూటింగ్ మాత్రం ఇక పూర్తి చేయలేదు.

Share post:

Latest