బాలీవుడ్ ని మరో విషయంలో బెంబేలెత్తిస్తున్న టాలీవుడ్ బడా హీరోలు? ఈసారి మహేశ్ వంతు!

సౌత్ తెలుగు పరిశ్రమ ధాటికి బాలీవుడ్ కి దెబ్బమీద దెబ్బ పడుతోంది. అవును.. బి టౌన్లో అగ్ర హీరోలు అనబడేవారి సంపదకు మనవాళ్లు గండి కొడుతున్నారు. అయితే ఇదంతా కావాలని కాదండోయ్. ఫేమ్ అలాంటిది మరి. క్రేజ్ యేమైనా చేస్తుంది. నందిని పంది చేయగలదు. పందిని నంది చేయగలదు. పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది.. తెలుగు చిత్రాలు హడా చాటడంతో బాలీవుడ్ కి దిమ్మతిరిగిపోయింది. అది చాలదన్నట్టు మరో విషయంలో మనవాళ్లు వారిని డామినేట్ చేస్తున్నారు.

తెలుగు నుంచి ప్రభాస్.. రానా… రామ్ చరణ్… బన్నీ… NTR లాంటి హీరోలు పాన్ ఇండియాలో ఫేమస్ అవ్వడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అవును… నిన్న మొన్నటి వరకు గొప్పలు పోయే హిందీ వాళ్లంతా ఇపుడు ఇండియాన్ సినిమా అంటూ అందర్నీ కలుపుకోవడం పరిపాటైంది. దాంతో ఈ హీరోల్ని బాలీవుడ్ దర్శక-నిర్మాతలు కూడా తమ పరిశ్రమకి తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. దీనంతటికి కారణం ఆయాస్టార్స్ క్రేజ్ ఒక్కటే కారణం. ఓ రకంగా ఇది కాస్త హిందీ హీరోలకి మింగుడు పడని విషయమే అనుకోవాలి.

ఇకపోతే, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు మరో విషయం బాలీవుడ్ బడా హీరోలని యెక్కువ బాధపెడుతోంది. సో కాల్డ్ కార్పోరేట్ కంపెనీలు ఇప్పుడు హిందీ హీరోలకంటే సౌత్ హీరోలతోనే యాడ్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. అందులోనూ తెలుగు హీరోలతో ఎక్కువగా తమ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఆసక్తి చూపించడం కొసమెరుపు. బన్నీ ఇప్పటికే బోలెడన్ని కమర్శియల్ యాడ్స్ చేసాడు. పాన్ ఇండియా వైడ్ అవి రిలీజ్ అవుతున్నాయి. హిందీ హీరోల్ని కాదని ఈ యాడ్స్ బన్నీ వరకూ రావడం గమనార్హం. ఇపుడు ఆ లిస్టులో సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చి చేరారు. హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే మహేష్ తో ప్రఖ్యాత కార్పోరేట్ కంపెనీలు మహేష్ తో యాడ్స్ చేసాయి. గత రెండేళ్లగా బాలీవుడ్ ఫామ్ లో లేకపోవడం వలనే ఇలాంటి గతి పట్టిందని సినిమా పండితులు అంటున్నారు.

Share post:

Latest