ఆగస్ట్ నెల సినిమాల సంగతి ఇదే… మొత్తం 19 సినిమాలు రిలీజైతే 16 ఫ్లాపులు అయ్యాయి చూడండి!

సినిమా అంటే అంత ఈజీకాదు. కొన్ని వందలమంది కష్టం. తీరా అన్ని కష్టాలను ఓర్చి తెరకెక్కిన ఆ సినిమా ఆడకపోతే, కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు రోడ్ల పాలవుతారు. ఫిలిం నగర్లో ఇలాంటి సంగతులెన్నో ఉంటాయి. కానీ ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం వారు రంగురంగుల ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు. కానీ దాని వెనకాల వున్న బాధలు వర్ణనాతీతం. సినిమా వ్యాపారమనేది చాలా రిస్కుతో కూడుకున్నది. ప్రతి ఏటా దాదాపు 200 నుండి 300 దాకా సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ అందులో హిట్టైన సినిమాలు మాత్రం వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.

ఇకపోతే ఈ ఆగస్ట్ నెలలోనే దాదాపు 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అందులో ప్రేక్షక మనసులను దోచుకున్నవి మాత్రం కేవలం మూడంటే మూడు సినిమాలు మాత్రమే. అవును… సినిమా పండితులు మాత్రం ఒకే నెలలో 3 పెద్ద హిట్స్ అంటే మామూలు విషయం కాదన్నట్టుగా చెబుతున్నారు. ఎందుకంటే, ఆమాత్రం హిట్స్ కూడా లేని ఇతర సినిమా పరిశ్రమలు ఎన్నో వున్నాయి మన ఇండియాలో. కాబట్టి ఆగస్ట్ బాక్సాఫీస్ టాలీవుడ్ కు అద్భుతంగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆగస్ట్ మొదటి వారంలో సీతారామం, బింబిసార సినిమాలు రిలీజయ్యాయి.

రెండూ అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ ఆశ్చర్యకరంగా సూపర్ హిట్టయ్యాయి. రెవెన్యూ పరంగా చెప్పాలంటే సూపర్ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఏకంగా రూ.70 కోట్ల గ్రాస్ రాబట్టగా, సీతారామం సినిమా రూ.72 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇంకా ఈ రెండు సినిమాలు పలు థియేటర్లలో ఆడటం కొసమెరుపు. అదలావుంటే… అదే వారం వచ్చిన కార్తికేయ 2 మాత్రం సర్ ప్రైజింగ్ సక్సెస్ అయింది. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ బెల్ట్ లో కూడా పెద్ద విజయం సాధించి, ఏకంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ప్లాపైన కొన్ని సినిమాల జాబితాని చూస్తే… తీస్ మార్ ఖాన్, తిరు, వాంటెడ్ పండుగాడ్, మాటరాని మౌనమిది, కమిట్ మెంట్, వాంటెడ్ పండుగాడ్, లైగర్, భళా చోర భళా, కళాపురం, కోబ్రా, హైవే, ఓదెల రైల్వే స్టేషన్, రిపీట్ మిగిలిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.