Tollywood: భర్తలు మరణించిన తరువాత కనుమరుగయిన భార్యల లిస్టు ఇదే! 

ఈరోజైనా రేపైనా మరణం అనేది ఎప్పుడైనా, ఎవ్వరినైనా కబళిస్తుంది. దానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు. అయితే సాధారణ ప్రజల విషయంలో ఏది ప్రపంచానికి పట్టదు. కానీ సెలిబ్రిటీల విషయంలో అలాకాదు. వారు తుమ్మినా దగ్గినా కూడా న్యూస్ అయిపోతుంది. ఇంకా వారి మరణ వార్తలనైతే దాదాపు వారం రోజులపాటు ఈ మీడియా ఛానళ్లవారు తిప్పి తిప్పి అదే వేస్తుంటారు. అలా సినిమా హీరోలకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు అందరూ సినిమా హీరోలు, ఆయా ఫ్యామిలీ ఎప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలను వెతుకుతూ వుంటారు.

ఇక అసలు విషయానికొస్తే, బేసిగ్గా ఆయా ఇంటికి పెద్ద అయినటువంటి సినిమా వాళ్ళు మరణించిన పిదప మాత్రం వాళ్ళ ఊసే ఎత్తరు. ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ భార్యల విషయం కూడా బయట ప్రపంచానికి తెలియదు. అలా హీరోలతో విడిపోయో, లేక మరణించో సోషల్ మీడియాకు కనిపించకుండా ఉన్న వాళ్ళు కొందరు వున్నారు. మొదటగా ఉదయ్ కిరణ్ భార్య విషితని తీసుకుంటే, ఉదయ్ కిరణ్ మరణించిన తరువాత ఈమె ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఉదయ్ కిరణ్ టాలీవుడ్లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. వరుస హిట్లు కొట్టిన ఆ తర్వాత కాలంలో వరుస ఫ్లాపులు రావటంతో చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

ఆ తరువాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి భార్య శ్రావణి గురించి మాట్లాడుకోవాలి అనారోగ్యం కారణంగా చనిపోయాడు చక్రి. అతను చనిపోయిన తర్వాత ఇక అతని భార్య శ్రావణి మీడియా కంట ఎప్పుడు పడలేదు అనే చెప్పాలి. ఇక చివరగా ప్రణతి రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ శ్రీమతి ప్రణతి రెడ్డి గురించి వినే వుంటారు. వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తరువాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే మనోజ్ తో విడాకుల తర్వాత ఆమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది? అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.