ఫహద్ ఫాసిల్..ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఉడకాడించిన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్. ఇలా చెప్తే అందరికీ టక్కును గుర్తొచ్చేస్తుంది. అంతలా తెలుగులో ఆయన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. పేరుకి మలయాళ నటుడే అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా కరోనా లాక్ డౌన్ మూమెంట్లో ఇంట్లో కూర్చొని జనాలు.. మలయాళ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల ఫహద్ ఫాసిల్ పేరు అందరికీ తెలిసిపోయింది . మరీ ముఖ్యంగా ఈయన నటించిన సినిమాలు చూసిన ఎవ్వరైనా సరే ఈయన నటనను మర్చిపోలేరు.
అంతలా సహజ సిద్ధంగా నటిస్తాడు. ఒక బాయ్ ఫ్రెండ్ గా అయినా.. ఒక భర్తగా అయినా.. ఒక ఓసిడి పర్సన్ గా అయినా.. ఒక విలన్ గా అయినా.. ఒక క్రూయాలిటీ పర్సన్ గా అయినా.. నటించగలిగే సత్తా ఉన్న ఏకైక మలయాళి నటుడు ఎవరబ్బా అంటే కచ్చితంగా అందరూ చెప్పే పేరు ఫహద్ ఫాసిల్. రీసెంట్ గా ఈయన భార్య నజ్రియా నజీమ్ నాని సినిమాలో “అంటే సుందరానికి” మూవీలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయినా నజ్రియా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
కాగా మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతున్న పుష్ప2 షూటింగ్లో పాల్గొనబోతున్న ఫహద్ ఫాసిల్ గురించి ఓ భయంకరమైన వార్త బయటకు వచ్చింది. మరీ ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ ఇది విన్నాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఫహద్ ఫాసిల్ చాలా కూల్ గా ఉంటారట . సరదాగా జోవియల్ గా మాట్లాడుతారట. కానీ ఎవ్వరైనా సరే ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు తట్టుకోలేరట. దీంతో కోపం వచ్చి ఊగిపోయి నరాలు బ్గపట్టేసి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయట. ప్రస్తుతానికి ఇది సామాన్య స్థితిలో ఉన్న ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ప్రాణానికే ప్రమాదం అంటూ డాక్టర్లు కూడా చెప్పుకొచ్చారట. దీనికోసం సపరేట్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడట ఈ హీరో విలన్.