ఈ స్టార్ విలన్ కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట..!!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సుబ్బరాజు విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. సుబ్బరాజు ఏ సినిమాలో నటించిన కూడా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలనటుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలలో తగ్గించినప్పటికీ పలు ఇంటర్వ్యూలలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు సుబ్బరాజు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Subbaraju - Biography, Height & Life Story | Super Stars Bio
సుబ్బరాజు మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఒకే కాలేజీలోనే చదువుకున్నానని తెలిపారు.భీమవరంలో ఎక్కువగా అమ్మాయిలు బాగా చదువుతూ ఉంటారని సుబ్బరాజు తెలిపారు. ఇక ఆర్య సినిమాలోని తన పాత్ర చాలా క్రూరంగా  తయారు చేశారు సుకుమార్ అని తెలియజేశారు. ఆ పాత్ర చూసినప్పుడల్లా తనకి చాలా నవ్వు వస్తుందని తెలియజేశారు. తెలుగు సినిమా డైరెక్టర్లలో ప్రతి ఒక్కరు కూడా తన ఫేవరెట్ డైరెక్టర్ అని తెలియజేశారు. ఇక హీరోలలో కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక క్వాలిటీ ఉందని కూడా తెలియజేశారు. అయితే తనకు మాత్రం ఫేవరెట్ హీరోయిన్ ఉందని తెలియజేశారు.ఆమెనే ఇలియానా అని తెలిపారు.
First look: Allu Arjun in Julayi - Rediff.com movies
ఒకవేళ హీరోగా తనకి అవకాశం వస్తే విలన్ గా మాత్రం అల్లు అర్జున్  నటించాలని తెలియజేశారు. అల్లు అర్జున్ సుబ్బరాజు ఎప్పుడు ఎక్కువగా సరదాగా కొట్టుకుంటూ ఉంటామని అందుచేతనే తను విలన్ అయితే బాగుంటుంది అని సుబ్బరాజు తెలియజేయడం జరిగింది. సినీ ప్రపంచం అనేది తన దృష్టిలో ఒక వండర్ ఫుల్ గా మీడియా అని తెలిపారు. ముఖ్యంగా ఏవైనా బాధ్యతలు అంటే తనకు చాలా భయమని తెలియజేశారు. ఐదారు సంవత్సరాలు కష్టపడ్డాక తనకు ఇండస్ట్రీలు ఒక పెద్ద డైలాగ్ చెప్తే అవకాశం వచ్చిందని అది కూడా నేనింతే సినిమాలో అని తెలిపారు సుబ్బరాజు. ప్రస్తుతం ఈ నటుడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.