మిస్ ఇండియా లో లేనిది..అనుష్క లో ఉన్నది ఇదే.. అబ్బబ్బా ఏం చెప్పారు పూరి గారు..!?

సినీ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అనే పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్.. ఎంతో మంది హీరోయిన్స్ ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లిస్టులో ఒకరే అనుష్క . సూపర్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన అనుష్క . ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది . అంతేకాదు ఆ సినిమాలో మొదటి హీరోయిన్ గా నటించిన అమ్మాయి కంటే అనుష్క నే బాగా నటించింది అంటూ జనాల మెచ్చుకున్నారు. అంతలా ఫస్ట్ సినిమాతోనే తన లోని నటన టాలెంట్ ను బయటపెట్టింది స్వీటీ.

అయితే ఈ సినిమా కోసం అనుష్కను ఆడిషన్ చేయడానికి ముంబై నుంచి హైదరాబాద్ కి పిలిపించ్చారట పూరి జగన్నాథ్. అయితే సినిమాలో నటించాలంటే ఆడిషన్స్ చేస్తారనే విషయం కూడా తెలియని అనుష్క.. ఎటువంటి మేకప్ లేకుండా ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే అడిషన్కు అటెండ్ అయిందట. అయితే ఆమెతోపాటు మరో వ్యక్తి కూడా ఆడిషన్ కి అటెండ్ అయ్యారట. ఆమె మరెవరో కాదు మిస్ ఇండియా పర్మిట్ ఠాగూర్.

నిజానికి ఓ మిస్ ఇండియాతో కాంపిటీషన్ కి వెళ్తే ఏ అమ్మాయికైనా సరే అక్కడ చేదు అనుభవమే ఎదురవుతుంది . అయితే స్వీటీ మాత్రం కాన్ఫిడెన్స్ తో భయం లేకుండా తనకు వచ్చింది చేసి చూపించిందట . అఫ్ కోర్స్ మిస్ ఇండియా కూడా బాగానే చేసింది . కానీ ఇద్దరిలో కంపేర్ చేస్తే నాగార్జునకు అనుష్కనే బాగా నచ్చేసిందట. అందుకే మిస్ ఇండియా ని రిజెక్ట్ చేసి అనుష్క ను సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట కింగ్ నాగార్జున . దీంతో మరో మాట చెప్పకుండా పూరి జగన్నాథ్ కూడా సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుష్క నే సెలెక్ట్ చేశారట. అయితే నాగార్జున నమ్మకాన్ని వమ్ము చేయలేదు స్వీటీ ..తనదైన స్టైల్ లో నటిస్తూ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు గడుస్తున్న హీరోయిన్గా సినిమాలు అవకాశాల్లో దక్కించుకుంటూ.. లీడ్ క్యారెక్టర్స్ చేస్తుంది .

Share post:

Latest