ఈ స్టార్ హీరోలు సినిమాల్లోనే కాదు.. బిజినెస్ లో కూడా తోపులే..!!

సాధారణంగా మన స్టార్ హీరోలు కోట్లకు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు.. వారి ఆస్తి అంత ఉంది.. వీరి ఆస్తి ఇన్ని వేల కోట్లు అంటూ ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ఉంటారు.. అయితే ఈ డబ్బునంతా వీరు కేవలం సినిమాల ద్వారా సంపాదించింది అయితే కాదు అని చెప్పాలి. ఇక సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వారు ఇతర రంగాలలో పెట్టుబడిగా పెట్టి ఆస్తిని వెనకేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబును మొదలుకొని మరి ఎంతోమంది స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు బిజినెస్ లు కూడా చూసుకుంటున్నారు. ఇక అలా సినిమాలలోనే కాదు బిజినెస్ లో కూడా సక్సెస్ అయిన తెలుగు స్టార్ హీరోల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

మహేష్ బాబు:As Mahesh Babu turns 47, top stars and fans mark the birthday with warm  wishes and re-release of smash hit Pokiri | Entertainment News,The Indian  Expressసూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలు చేసుకుంటూనే.. మరొకవైపు బిజినెస్ లు కూడా చూసుకుంటున్నారు. అంతేకాదు ఏ ఎం బి థియేటర్ తో థియేటర్ రంగంలో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈయన తన భార్య నమ్రతతో కలిసి క్లాత్ బిజినెస్ కూడా మొదలుపెట్టారు .ఇక మరొకవైపు Byzus ఇంటర్నేషనల్ కంపెనీ తో కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ రంగంలో అడుగు పెట్టారు. మహేష్ బాబు. ఇక నిర్మాణ సంస్థను కూడా ఈయన మెయింటైన్ చేస్తూ ఉండడం గమనార్హం. అందుకే ఈయన దగ్గర సుమారుగా కొన్ని వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని, ఇక తన తండ్రి వారసత్వంగా కూడా కొంత ఆస్తి వచ్చిందని సమాచారం.

విజయ్ దేవరకొండ:Vijay Devarakonda: బర్త్‌డే రోజు ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. సోషల్‌  మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌.. | Vijay Devarakonda emotional post on his  birthday | TV9 Teluguఇప్పుడిప్పుడే పాన్ ఇండియా హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న విజయ్ దేవరకొండ సినిమాలలోనే కాదు వ్యాపారంలో కూడా ముందంజలో ఉన్నారు. రౌడీ వేర్ అనే పేరుతో విజయ్ ఆన్లైన్లో దుస్తులు విక్రయిస్తున్నారు. ఇక అంతేకాకుండా మహబూబ్ నగర్ లో మల్టీప్లెక్స్ కూడా ప్రారంభించాడు.

రామ్ చరణ్:Ram Charan : చరణ్ ఈ సస్పెన్స్ కి తెర దించు.. | Hero ram charan fans waiting  for next movie update after RRRపాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ వరుస సినిమాలు మాత్రమే కాకుండా ట్రూజెట్ ఎయిర్లైన్స్ పేరుతో విమాన రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఇక ఈయనకు గుర్రాలంటే ఎక్కువ ఇష్టం ఉండడం చేత పోలో బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టాడు.

నాగార్జున:
కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణతో పాటు సినిమాల నిర్మాణం , ఫుట్బాల్ టీం , ఒక రేసింగ్ కంపెనీని కూడా నడుపుతున్నాడు. ఇక అన్ని వ్యాపారాలలో కూడా ఈయనకు మంచి పట్టు ఉంది.

అల్లు అర్జున్:Allu Arjun's latest pic gets fans excited for Pushpa The Rule, Rashmika  Mandanna says 'couldn't recognise you' | Entertainment News,The Indian  Expressఈయన సినిమాలతోపాటు వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. ఇక ఈయనకు ఒక పబ్ కూడా ఉంది. అంతేకాదు అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో AAA పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మిస్తున్నారు. ఇక వీరితో పాటు మరెంతో మంది తెలుగు హీరోలు బిజినెస్ రంగంలో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకోవడం గమనార్హం.

Share post:

Latest