ఈ టీడీపీ వీర విధేయులు దొంగ చాటుగా దాక్కుంటున్నారే…!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల్లో అంద‌రూ.. ఒకేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదా…? కొంద‌రు పార్టీలో చాలా గో ప్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? పార్టీకి విధేయులం అంటూనే ప‌క్క చూపులు చూస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒక‌రు.. పార్టీ త‌ర‌ఫున మాట్లాడిన‌ట్టే మాట్లాడుతున్నా రు. కానీ, ఇంత‌లోనే ఖ‌స్సు మంటున్నారు. మ‌రోవైపు ఒక జాతీయ పార్టీతో ట‌చ్‌లో ఉన్న‌ట్టు క‌ల‌రింగ్ ఇస్తు న్నారు. దీంతో ఈయ‌న వ్యూహం ఏంటో ఎవ‌రికీ అర్ధంకావ‌డం లేదు.

ఇక‌, అనంత‌పురానికి చెందిన ఓ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ చేస్తున్న పనుల‌తో పార్టీ మ‌రింత బ‌జారున ప‌డుతోంది. పార్టీలోనే ఉంటారు.. ఉన్న‌ట్టు చెబుతారు. కానీ.. పార్టీ త‌ర‌ఫున మాత్రం మాట్లాడ‌రు. ఎక్క‌డైనా..ఎప్పుడైనా.. మాట్లాడినా.. వివాదాల‌కు కేంద్ర‌మే! పార్టీని ఇరుకున పెట్ట‌డ‌మే ప‌నిగా ప‌నిచేస్తున్నార‌నే వాద‌న వినిపి స్తోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ పుంజుకుంటే స‌రి.. లేక‌పోతే.. పొరుగు పార్టీల‌వైపు వీరు చూస్తు న్నార‌ని జిల్లా వ్యాప్తంగా టాక్‌.

క‌ర్నూలులోనూ.. ఇదే త‌ర‌హా.. డొంక తిరుగుడు రాజ‌కీయం చేస్తున్న‌వారు.. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను మించిన రీతిలోల పాలిటిక్స్‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ప్ర‌స్తుతం బీజేపీలో తండ్రి ఉంటే. కొడుకు టీడీపీలోఉన్నాడు. అయితే.. ఏమాత్రం తేడా వ‌చ్చినా.. అధికార పార్టీలోకి చేరేందుకు.. కొడుకు చూస్తుంటే.. వెయిట్ చేయ‌మ ని.. తండ్రి చెబుతున్నార‌ట‌. ఇదీ.. వీరి స‌స్పెన్స్ పాలిటిక్స్‌. ఇక‌, ఇదే జిల్లాల్లో.. సీనియ‌ర్లు.. ఆ.. ఇప్పుడు ఎందుకు.. ఎన్నిక‌ల స‌మ‌యానికి చూసుకుందాం.. అనే ధోర‌ణిలోనే ఉన్నార‌ట‌. వీరి వ్యూహం ఏంటో కూడా అంతా స‌స్పెన్స్‌గానే ఉంది.

ఉత్తరాంధ్ర విష‌యానికి వ‌స్తే.. మాజీ మంత్రి ఒక‌రు అస‌లు పార్టీలో ఉన్నారా? లేరా? అంటే.. అధినేతే చెప్పలేని ప‌రిస్థితి. ఇక‌, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. పార్టీలోకి చేరిన జంప్ జిలానీల వాయిస్ వినిపించ‌డ‌మే లేదు. అదేమంటే.. ఏదో సాకు చెబుతున్నారు. పైగా.. టీడీపీకి వీర విధేయులం అంటారు. కానీ.. అవ‌కాశం కొసం చూస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, జంపింగ్ మాజీ మంత్రి ఎక్క‌డున్నారో.. ఆ దొర‌వారికే తెలియాలి.. ఇలా స‌స్పెన్స్‌.. థ్రిల్ల‌ర్ రాజ‌కీయాలు.. ఒక్క టీడీపీలోనే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.