కడపలో టీడీపీకి ఆ నాలుగు ప్లస్?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై వైసీపీ ఏ విధంగా ఫోకస్ పెట్టి రాజకీయం నడుపుతుందో తెలిసిందే. ఇప్పటికే జిల్లాపై పట్టు పెంచుకున్న వైసీపీ…వచ్చే ఎన్నికల్లో కుప్పంని కూడా కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. గత ఎన్నికల్లోనే 14కు 13 సీట్లు గెలుచుకుంది. ఈ సారి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. అయితే చిత్తూరులో వైసీపీ ఆధిక్యం తగ్గించాలని చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అదే సమయంలో జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెట్టారు.

చిత్తూరుకు కౌంటరుగా కడపలో సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే కడప అనేది వైసీపీ కంచుకోట. ఇక్కడ టీడీపీ గెలుపు అంత సులువు కాదు. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. కానీ ఈ సారి సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలపై టీడీపీ ఫోకస్ పెట్టి పనిచేస్తుంది. ఖచ్చితంగా ఆ సీట్లని గెలుచుకుని తీరాలనే విధంగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు.

అయితే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగా కలిసొస్తుంది..ఇదే క్రమంలో కొన్ని సీట్లని టీడీపీ గెలుచుకునే అవకాశాలు వచ్చాయని తెలుస్తోంది. తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో కూడా ఇదే తేలింది. కడపలో వైసీపీ…పులివెందుల, బద్వేల్, కడప, జమ్మలమడుగు, రాయచోటి సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ మైదుకూరులో గెలుస్తుందని తేలింది.

కానీ ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వే కోడూరు, కమలాపురం సీట్లలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని తెలిసింది. ఒక కమలాపురంలో వైసీపీకి ఎడ్జ్ ఉండగా, మిగిలిన మూడు సీట్లలో టీడీపీకి ఎడ్జ్ ఉందని సర్వేలో తేలింది. అంటే టీడీపీ ఇంకాస్త కష్టపడితే మైదుకూరుతో పాటు రాజంపేట, కోడూరు, ప్రొద్దుటూరు సీట్లని టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ వైసీపీ ఇంకా జాగ్రత్తపడాల్సి ఉంది. టీడీపీని తక్కువ అంచనా వేసి ముందుకెళ్లకూడదు. చూడాలి మరి ఈ సారి కడప ఫలితాలు ఎలా ఉంటాయో.

Share post:

Latest