టీడీపీ-జనసేన కాంబో..ఆ జిల్లా స్వీప్?

టీడీపీ-జనసేన పొత్తు…ఈ విషయంపై చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది…రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది..అటు పొత్తుకు రెండు పార్టీలు రెడీగానే ఉన్నాయని హింట్ కూడా ఇచ్చాయి. అయితే పొత్తు గురించి అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. కానీ వైసీపీని అధికారంలో నుంచి దించాలంటే రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు పార్టీల శ్రేణులు సైతం పొత్తుకు మానసికంగా సిద్ధమవుతున్నాయి.

ఏదేమైనా గాని రెండు పార్టీల మధ్య ఉండటం ఖాయమని తెలుస్తోంది…ఒకవేళ టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఫిక్స్ అయితే…వైసీపీకి రిస్క్ అని చెప్పొచ్చు. ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకి లాభం గాని, కలిసి పోటీ చేస్తే మాత్రం నష్టమే. ముఖ్యంగా కోస్తాలో వైసీపీకి భారీ నష్టం జరుగుతుంది. అదే క్రమంలో టీడీపీ-జనసేన పొత్తు వల్ల కొన్ని జిల్లాల్లో వైసీపీ ఒకటి-రెండు సీట్లకే పరిమితం కావొచ్చని ప్రచారం జరుగుతుంది.

ఇదే క్రమంలో విశాఖ జిల్లాలో టీడీపీ-జనసేన పార్టీలు క్లీన్ స్వీప్ చేయొచ్చని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన విశాఖ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, భీమిలి స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు టీడీపీ గెలుచుకోగా, గాజువాక, భీమిలి సీట్లు వైసీపీ గెలుచుకుంది.

వైసీపీ వేవ్‌లో పైగా జనసేన విడిగా పోటీ చేసిన టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది…అదే ఇప్పుడు వైసీపీ బలం తగ్గుతుంది..అటు టీడీపీ-జనసేన బలం పెరుగుతుంది. ఇదే సమయంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం ఈ ఆరు సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే విశాఖ నార్త్‌లోనే కొంచెం టఫ్ ఫైట్ ఉండొచ్చని తెలుస్తోంది. అక్కడ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకు ఓ 20 వేల ఓట్లు ఉన్నాయి. ఒకవేళ పొత్తులో బీజేపీ కూడా కలిస్తే…డౌట్ లేకుండా విశాఖ క్లీన్ స్వీప్ చేస్తాయి.

Share post:

Latest