2 నిముషాలు అలా చేస్తే 5 కోట్లు..స్టార్ హీరోయిన్ అలాంటి చెత్త పని చేసిందా..?

బాలీవుడ్ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్తని హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కట్ ట్రెండ్ మనకి సర్వసాధారణంగా కనిపించింది. అయితే ఇక ఈ సంవత్సరం మాత్రం బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దాఖలాలే కనబడడం లేదు. ఇక బాలీవుడ్ లో సినిమాలు హిట్ అవ్వ‌కపోవడానికి కారణం బాయ్ కట్ ట్రెండ్ అయితే మరొక కారణం సినిమాల్లో మంచి కంటెంట్ లేకపోవడం అని మనకి అర్ద‌మ‌వుతుంది.

అంతే కాకుండా బాలీవుడ్ లో నెపోటిజం గురించి ఈ మధ్యన చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కొన్నాళ్ళ క్రితం జరిగిన ఓ సంఘ‌ట‌న‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ చక్కెరలు కొడుతుంది. ఇక అస‌లు విషయంలోకి వెళ్తే దాదాపు రెండు సంవత్సరాల క్రితం పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎన్ ఆర్సీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లేఖ‌ను జారీ చేసింది. అయితే దీనికి వ్యతిరేకంగా 2020 జనవరి ఫస్ట్ వీక్ లో ఢిల్లీలోని జెఎన్టియు యూనివర్సిటీ ద‌గ్గ‌ర కొంద‌రు విద్యార్థులు వారి యొక్క నిరసన వ్యక్తం చేశారు. ఇక అప్పట్లో ఈ వార్త హింసాత్మకంగా కూడా మారి దాని ప్ర‌భావం వల్ల చాలా న‌ష్టలు కూడా జ‌రిగాయి.

అయితే కొంతమంది దుండగులు మోహానికి మాస్క్ వేసుకుని దాడికి పాల్పడడంతో దాదాపు 50 మంది వరకు ప్ర‌జ‌లు గాయాలు పాలయ్యారు. అయితే వీళ్ళను ప‌రామ‌రిసించ‌డానికి ఓ రోజు బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోని జేఎన్టీయూ యూనివర్సిటీకి వెళ్ళింది. ఇక హీరోయిన్ దీపిక పదుకోని వెళ్లడం అప్పట్లో రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే దీపికా పదుకొనే జెఎన్టియు యూనివర్సిటీకి వెళ్లడానికి దాదాపు 5 కోట్ల వరకు డబ్బులు తీసుకుందని ఒక వార్త అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ వార్త ప్రచారం జరుగుతూనే ఉంది కానీ దీపికా పదుకొనే ఇప్పటివరకు ఆ వార్తలకు స‌మాధానం ఎవ్వ‌రికీ ఇవ్వలేదు. అయితే ఈ మధ్యన‌ ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ స్వర భాస్కర్ ని ఈ విషయం గురించి అడగగా ఆమె ఈ వార్తపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అసలు ఇది పూర్తిగా వాస్తఅవాస్త‌వాలు లేని వ్యవహారం.అయిన‌ రెండు నిమిషాలు యూనివర్సిటీలో ఉన్నందుకే ఐదు కోట్లు ఎవరైనా ఇస్తారా.. సినిమా వాళ్ల గురించి మరీ ఇంత దారుణంగా నీచంగా మాట్లాడుకుంటారా.. అసలు ఇండస్ట్రీ వాళ్ళు మీకు ఎలా కనిపిస్తున్నారు.. అని హీరోయిన్ సర్వ భాస్కర్ చాలా సీరియ‌స్ అయ్యింది. కాబట్టి దీనిపై దీపికా పదుకొనే స్పందించి నిజానిజాలు చెప్పే వరకు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.