చిరు, నాగ్ కే సవాల్.. విసురుతున్న సన్నీలియోన్..!

సంక్రాంతి తర్వాత సినిమాల వాళ్ళకి బాగా కలిసి వచ్చే సీజన్ దసరా కూడా ఒకటి ఆ టైంలో సినిమాలు విడుదల చేయాలని దర్శక -నిర్మాతలు- హీరోలు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ టైంలో వచ్చిన సినిమాలు ఖ‌చ్చితంగా హిట్ అవుతాయని అందరు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈసారి దసరా కూడా సినిమాలు హడావుడి బాగానే ఉంది. ప్రధానంగా ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే రోజున వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారు.

Nagarjuna reveals Bangarraju and Chiranjeevi's secrets | cinejosh.com

వారు ఎవరంటే చిరంజీవి- నాగార్జున వీరిద్దరి రెండు పెద్ద సినిమాలతో దసరాకి థియేటర్లో సందడి చేయబోతున్నారు. ఈ ఇద్ద‌రిలో ఎవరు విజయం సాధిస్తారని మనం చూడాలి. వీటితోపాటు పలు చిన్న సినిమాలు కూడా ఈ సినిమాలకు పోటీగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలకు పోటీగా మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. అ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. మంచు మోహన్ బాబు నట వార‌సుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మంచు విష్ణు తన కెరియర్ ఆరంభంలో వరుస‌ సినిమాలు చేస్తూ హిట్‌లు అందుకుని దూసుకుపోయాడు. ఈ సందర్భంలోనే గత కొన్ని సంవత్సరాలుగా మంచు విష్ణు చేసిన సినిమాలన్నీ విజయాన్ని సాధించలేకపోతున్నాయి. ఎప్పుడో వచ్చిన ‘ఈడోరకం ఆడోరకం’ సినిమా తర్వాత మంచు విష్ణు విజయం సాధించలేదు.

Will it be Chiranjeevi's 'Godfather' vs Nagarjuna's 'The Ghost' at the  boxoffice this 'Dasara'? | Telugu Movie News - Times of India

తాజాగా ఇప్పుడు మంచు విష్ణు ఆశలన్నీ ఇప్పుడు వచ్చే ‘జిన్నా’ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇందులో మంచు విష్ణుకు జోడీగా అందాల భామ పాయల్ రాజ్ పుత్ మరియు హాట్ బామ సన్నీలియోన్ కూడా ఇందులో నటించింది. ఈ సినిమా స్టోరీ మొత్తం సన్నీలియోన్ చుట్టూనే తిరుగుతుంటుందని సినిమా వర్గాల్లో టాక్. అందుకే ఈ సినిమా మీద మంచు విష్ణు భారీ ఆశలు పెట్టుకున్నాడని చెప్పాలి. ఈ సినిమాని మంచు విష్ణు పాన్ ఇండియా లెవెల్ లో తెరుకెక్కించాడు.

Vishnu Manchu: Jinnah movie teaser date.. Manchu Vishnu is getting ready »  Jsnewstimes

ఈ సినిమాని ఖ‌చ్చితంగా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్టు తాజాగా వచ్చిన టీజర్ లో చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా విడుదల తేదీ బయటికి రావటంతో.. ఈ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మంచు విష్ణు హిట్‌ కోసం ఏకంగా చిరంజీవి- నాగార్జునకు సన్నీలియోన్ తో పోటీ పెట్టాడంటూ, కామెంట్లు వస్తున్నాయి. ‘జిన్నా’ సినిమాను సూర్య అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మోహన్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సన్నీలియోన్ నమ్ముకున్న మంచు విష్ణు ఈ సినిమాతో సాలిడ్ హిట్‌ కొడతాడో లేదో చూడాలి.

Share post:

Latest