నువ్వునాకు న‌చ్చావ్ సినిమాను ఇంత‌మంది హీరోయిన్లు వ‌దులుకున్నారా..!

వెంకటేష్ హీరోగా , ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇక ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో నటీనటులు తమ పాత్రలలో జీవించేశారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ , సుధా, హేమ, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ , బ్రహ్మానందం, సునీల్ అందరూ కూడా తమ టాలెంటును నిరూపించుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఆర్తి అగర్వాల్ చెల్లెలు పాత్రలో సుదీప కూడా ఏకంగా 25 మందిని ఆడిషన్స్ జరిపిన తర్వాత ఈమె సెలెక్ట్ అవ్వడం గమనార్హం.Happy Birthday Trisha: From 'Vinnaithaandi Varuvaayaa' to '96', let's take  a look at the South actor's best performances నిజానికి సుదీప హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది.. కానీ ఆర్తి అగర్వాల్ ను ప్రధాన హీరోయిన్ గా తీసుకున్నారు కాబట్టి ఆమె చెల్లెలి పాత్రలు చిన్నపిల్లగా కంటికి అద్దాలు తగిలించి స్కూల్ అమ్మాయి పాత్రలో నటింప చేశారు.. నిజానికి తనకు కళ్ళు బాగానే పనిచేస్తున్నాయని.. ఇప్పటికీ తనకు దృష్టిలోపం లేదు అని, అది కేవలం పాత్ర కోసం మాత్రమేనని సుదీప కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.Everything Between Tarun and Aarthi Agarwal are just Rumors - Lovely Telugu

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు కూడా వదులుకోవడం జరిగింది.. అసలు విషయం ఏమిటంటే ముందుగా నిర్మాత స్రవంతి రవి కిషోర్ కు.. త్రివిక్రమ్, కే విజయభాస్కర్ ఈ సినిమా కథ ను వినిపించారు. అయితే నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాత్రం నువ్వు నాకు నచ్చావ్ సినిమా కథను హీరో తరుణ్ కి వినిపించాలనుకున్నాడు .South Indian actress Gajala to tie the knot with TV actor Faisal Khan అదే సమయంలో సురేష్ బాబు తన దగ్గర వెంకటేష్ డేట్స్ ఉన్నాయని చెప్పడంతో స్రవంతి రవి కిషోర్ , విజయభాస్కర్ , త్రివిక్రమ్.. వెంకటేష్ కి కథ చెప్పి ఒప్పించడం .. వాళ్ళందరూ వెంటనే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించడం జరిగింది.Watch Nuvvu Naaku Nachav - Disney+ Hotstar

హీరోయిన్స్ ఎంపిక విషయంలో మొదట త్రిష, గజాల పేర్లు పరిశీలించారు. కానీ ఆ హీరోయిన్ల కంటే ఒక కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించిన నిర్మాతలు ఆర్తి అగర్వాల్ ను తీసుకొచ్చి ఈ సినిమాతో తొలిసారి తెలుగుతెరకు పరిచయం చేశారు. ఇక అలా మొదటి సినిమాతోనే ఆమె మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే పరోక్షంగా తరుణ్, త్రిష , గజాల లాంటివాళ్ళు ఈ సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.

Share post:

Latest