సిఎం సమక్షంలో ఆ హీరో తో నా పెళ్లి జరగాలి..హీరోయిన్ షాకింగ్ డిమాండ్ ..!!

అందాల భామ సిద్ధి ఇద్నాని.. ఇలా చెప్తే ఎవ్వరు గుర్తుపట్టలేకపోవచ్చు. 2018లో “జంబలకడిపంబ” అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత ..”ప్రేమ కథ చిత్రం 2″ , “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి”, ఆ తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాలల్లో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక్కడ తెలుగులో సక్సెస్ కాలేం అనుకునిందో ఏమో తన కాన్సన్ట్రేషన్ కోలీవుడ్ పై పెట్టింది. అంతే కోలీవుడ్లో అమ్మడు అందాలకు ఫిదా అయిపోయారు జనాలు. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది అమ్మడు.

రీసెంట్ గా స్టార్ హీరో శింబు సరసన ” వెందు తానిండదు కాదు” అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకొని సూపర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అంతే కాదు కేవలం రెండు రోజుల్లోనే 25 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ.. ఓ స్టోరీని స్పాట్లో అల్లేసింది.

ఆ స్టోరీ వినడానికి చాలా బాగుంది. మంచి డైరెక్టర్ చేతిలో పడితే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటున్నారు కోలీవుడ్ జనాలు. ఇంతకీ ఆమె చెప్పిన స్టోరీ ఏంటో తెలుసా..శింబుతో కలిసి ఎలాంటి స్టోరీలో పనిచేయడానికి ఇష్టపడతారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ..” శింబు అలాగే నేను స్కూల్ డేస్ నుంచి స్వీట్ హార్ట్ గా ఉండాలి. చైల్డ్ హుడ్ లో స్టార్ట్ అయిన మా లవ్ యంగ్ ఏజ్ కి వచ్చేసరికి మరింత బలంగా మారుతుంది.

ఇక్కడ నా తండ్రి ఎవరనుకుంటున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. నా ఫేవరెట్ హీరో ఉదయనిది స్టాలిన్ శింబు సోదరుడుగా నటించాలి.. మధ్యలో కొన్ని రొమాన్స్ సీన్లు.. కొన్ని గిల్లికజ్జాలు ఫైట్లు.. సీన్ కట్ చేస్తే ఫైనల్ క్లైమాక్స్ నా తండ్రిగా నటిస్తున్న రజనీకాంత్ ..శింబు సోదరుడిగా నటిస్తున్న ఉదయనిధి స్టాలిన్ మాకు పెళ్లి చేయాలి. మరో షాకింగ్ కండిషన్ ఏంటంటే ఈ పెళ్లికి స్పెషల్ గెస్ట్ రోల్ లో ఉదయినిది స్టాలిన్ వాళ్ళ ఫాదర్ M K స్టాలిన్ గారు గెస్ట్ గా రావాలి . ఆయన సమక్షంలో మా ఇద్దరి పెళ్లి జరగాలి సినిమా ఎండ్ అవ్వాలి” అంటూ ఈ బ్యూటీ సరదాగా చెప్పుకొచ్చింది. అఫ్కోర్స్ ఈ బ్యూటీ సరదాగా చెప్పుకొచ్చిన స్టోరీ మాత్రం సూపర్ గా ఉంది అంటున్నారు కోలీవుడ్ జనాలు. మరి చూడాలి ఏ డైరెక్టర్ ఈ అమ్మడుకి అవకాశం ఇస్తారో..?

 

Share post:

Latest