షాక్ ఇచ్చేలా ఉన్న వారసుడు డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే..?

తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి నటిస్తున్న తాజా చిత్రం వారసుడు. ఈ చిత్రంతో మొదటిసారిగా తెలుగు సినిమా నీ డైరెక్ట్ గా చేస్తున్నాడు హీరో విజయ్.. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమాని వరిసు అనే పేరుతో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. ఇందులో విజయ్ సరసన హీరోయిన్ రష్మిక కూడా నటిస్తున్నది.

Varasudu Movie | The first single of 'Varasudu' will come soon.. Thaman's  tweet goes viral

ఈ విధంగా దిల్ రాజు నిర్మాణంలో ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటూ ఉండంగానే ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకే అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ఏకంగా రూ. 58 కోట్లకు కైవసం చేసుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడుపోయిందంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు . కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా సాటిలైట్ రైట్స్ సన్ టీవీ ఏకంగా రూ. 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ విధంగా డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్ మాత్రమే కాకుండా మ్యూజికల్ రైట్స్ కూడా టీ సిరీస్ రూ.10 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం విడుదల కాకుండానే నాన్ థియేటర్స్ బిజినెస్ భారీగా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దిల్ రాజు సేఫ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

 

Share post:

Latest