శోభన్‌బాబుతో జయలలిత స్ట్రాంగ్ రిలేషన్.. ఈ జంటకు పుట్టిన అమ్మాయి ఎక్కడుందంటే

పురుచ్చి తలైవి జయలలిత అంటే తమిళ ప్రజలు ఆరాధిస్తారు. ఎన్నో రకాల వైవిధ్యమైన సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఎంజీఆర్ అనుంగ అనుచరురాలిగా ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం తమిళనాడును ముఖ్యమంత్రిగా పాలించింది. అనారోగ్య కారణంగా ఆమె మరణించిన తర్వాత ఎన్నో రకాల వదంతులు వచ్చాయి. వాటిలో కొన్ని నిజమని నమ్మేవారు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఆంధ్రుల అందగాడు శోభన్ బాబుతో ఆమె బంధం కూడా ఒకటి. శోభన్ బాబుల మధ్య సాగుతున్న ప్రేమ అప్పట్లో వినోద పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ప్రపంచం గురించి పట్టించుకోకుండా, వెండితెరకు చెందిన ఇద్దరు స్టార్లు పబ్లిక్‌లో కనిపించే వారని తెలుస్తోంది.

శోభన్‌బాబు-జయలలిత బంధం చాలా గాఢమైందని సినీ వర్గాలు చర్చించుకునేవి. ఇక శోభన్ బాబు అంటే ఆమె చాలా ఇష్టపడేదని అప్పటి జర్నలిస్టులు చెబుతుంటారు. శోభన్ బాబును బైనాక్యులర్ ద్వారా చూసేందుకు జయలలిత ప్రయత్నిస్తుండగా ఓ జర్నలిస్టులు ఆమెను చూసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరు ప్రేమికుల మధ్య అంతా సజావుగా సాగిందని, ఆ సమయంలోనే జయలలిత కొన్నాళ్లకు శోభన్‌బాబును పెళ్లికి ప్రతిపాదించారని ఫిల్మ్ వర్గాల్ల సమాచారం. అయితే తనకు భార్య, పిల్లలు ఉన్నారని, అందువల్ల తాను పెళ్లిచేసుకోలేనని చెప్పినట్లు వారి సన్నిహిత వర్గాలు పేర్కొంటాయి. ఇలా తన ప్రేమను శోభన్ బాబు తిరస్కరించడంతో ఆమె బాగా క్రుంగిపోయిందని, దీంతో పెళ్లి అనే పదానికి తన జీవితంలో ఆమె చోటివ్వలేదని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ ఎంతో సఖ్యతగా ఉండేవారని, వీరి ప్రేమ బంధానికి ఓ కుమార్తె కూడా పుట్టిందని అంతా చర్చించుకుంటారు.


జయలలిత మరణం తర్వాత ఓ యువతి తాను వారిద్దరికీ పుట్టానని కోర్టుకెక్కింది. చివరికి కోర్టు ఆమె పిటిషన్ కొట్టేసింది. అయితే సీనియర్ జర్నలిస్టు ఇమంది రామారావు మాత్రం వీరిద్దరికీ ఓ కుమార్తె ఉందని, ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వారికి కొడుకు పుట్టలేదని చెప్పారు. అప్పట్లో ఓ అబ్బాయికి జయలలిత పుట్టిన రోజు వేడుకలు చేస్తే, అంతా శోభన్ బాబుకు ఆమెకు ఆ అబ్బాయి పుట్టాడనే ప్రచారం చేశారని పేర్కొన్నారు.

Share post:

Latest