వాడికి ఎంత పొగరంటే..? లైఫ్ ఇచ్చిన నాకే హ్యాండ్ ఇచ్చాడు..శర్వా కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “ఒకే ఒక జీవితం” ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్లను కూడా చాలా వేగంగా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రి రీలీజ్‌ ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా మొత్తం అమ్మ ప్రేమ గురించి తిరుగుతూ ఉంటుంది. అమ్మ‌ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ సినిమాలో నాతోపాటు నటించిన ప్రతి ఒక్కరూ హీరోలే అని ఆయన వారిని ప్రశంసించాడు’. ఈ సినిమాతో సీనియర్ నటి అమల రీఎంట్రీ ఇవ్వబోతుంది. ‘అమల గారితో నటించడం చాలా ఆనందంగా ఉందని, ఆవిడతో నటించడం నాకేం కష్టంగా అనిపించలేదని, తన అమ్మతో పని చేసినట్లే ఉందని శర్వానంద్ చెప్పారు’.

ఒకే ఒక జీవితం గొప్ప చిత్రం.. మీ అందరికీ నచ్చుతుంది.. ప్రామిస్: ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్

ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌లు కూడా కీలక పాత్రలో నా నటించారు. ‘శర్వా వారికి కూడా థాంక్స్ చెప్తూ వెన్నెల కిషోర్ ని నేను ఈవెంట్ కి రమ్మంటే రాలేదు వాడికి బాగా బలిసిందంటూ ఫన్నీ కామెంట్స్‌తో ఆగ్రహం వ్యక్తం చేశాడు శ‌ర్వానంద్‌’. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా రీతు వర్మ నటించింది. ఈ సినిమాను శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ‘ఈ సినిమాను ఆయన చెప్పిన కథను నమ్మే చేశాము. ప్రేక్షకుడికి ఖ‌చ్చితంగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నా. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని నమ్ముతూ శర్వానంద్‌ తన ప్రసంగాన్నిని ముగించాడు’.

Share post:

Latest