అన్నాచెల్లెలుగా నటించిన స్టార్ హీరో హీరోయిన్.. ఎవరు.. ఏ సినిమానో తెలుసా..?

సాధారణంగా ఏ సినిమాలలో అయినా సరే ఒక స్టార్ హీరోయిన్.. ఒక స్టార్ హీరోకి అక్క, చెల్లి, తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలలో నటించడానికి ససేమీరా అంటారు . కానీ ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరోయిన్ చెల్లి పాత్రలో నటించి మరింతగా ప్రేక్షకులను మెప్పించింది. అయితే వారు స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత కాదులెండి.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అలా నటించి వెండితెరకు పరిచయమయ్యారు.. నిజానికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ , అఖిల్, తరుణ్ , అల్లు అర్జున్ లాంటి వాళ్ళందరూ కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను మెప్పించిన వారే.. ఇక అలాగే హీరోయిన్ల విషయానికి వస్తే.. మీనా, రాశి, లయ , షాలిని, శ్రీదేవి, హన్సిక ఇలా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ లుగా తమ సత్తా చాటుతున్నారు.Bala Gopaludu Movie Child Artists Then and Now, Actress Rasi, Hero kalyan  Ram, Balakrishna, Suhasini, - Telugu Actress Rasi, Balagopaludu, Balakrishna,  Kalyan Ram, Suhasini

ఇక ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే స్టార్ హీరోయిన్ రాశీ కూడా ఒక సినిమాలో అన్నా చెల్లెలుగా నటించారు. ఇక ఆ సినిమా ఏమిటి అంటే ..నందమూరి బాలకృష్ణ దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్లో ఆరు సినిమాలు రాగా .. ఆ ఆరు సినిమాలు కూడా 100 రోజులాడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వాటిలో బాలగోపాలుడు చిత్రం ఒకటి . ఇందులో నటి సుహాసిని హీరోయిన్ గా నటించగా.. ఈ సినిమాలో కళ్యాణ్ రా, రాశీ ఇద్దరూ కూడా బాలా నటులుగా అన్నా చెల్లెలుగా నటించారు.బాలకృష్ణ చిత్రంలో నటించిన ఈ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?  | The News Qube

ఈ సినిమాలో తప్ప మరో ఏ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించలేదు. ఇక రాశీ మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు , కన్నడ, తమిళ్, మలయాళం భాషలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అంతే కాదు చైల్డ్ ఆర్టిస్టులుగా వీరికి ఈ సినిమాతో మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఇక రాశీ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి అప్పుడప్పుడు బుల్లితెర షోలలో అలరిస్తూ ఉంటుంది . ఇక ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ..తన కెరీర్ ను కొనసాగిస్తూ ఉండడం గమనార్హం.