ఎన్టీఆర్ , ఉదయ్ కిరణ్ లను చూసి దిద్దుకోలేని తప్పు చేశా.. బాలాదిత్య..!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయపథం వైపు దూసుకుపోతుంటే మిగతా సెలబ్రిటీలకు కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే అలా కలలుకని.. వారిని ఇన్స్పైర్ గా చేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది తమ ప్రతిభ ను చూపించినప్పటికీ ప్రేక్షకులు ఆదరించలేకపోవడంతో చివరికి తప్పు చేశామని బాధపడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో చంటిగాడు ఫేమ్ బాలాదిత్య కూడా ఒకరు. బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఇకపోతే ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత సినిమాలలో కనిపించలేదు. ఇక ఉన్నట్టుండి ఇన్ని రోజులకు బిగ్ బాస్ 6లో అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం.

Bigg Boss Telugu 6 contestant Baladitya: From noteworthy work on TV to web  series, the award-winning actor-host is a housemate to watch out for -  Times of Indiaఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బాలాదిత్య చాలా ఓపికగా ఆట ఆడుతూ ఎట్టకేలకు మొదటి కెప్టెన్ గా ఎన్నికయ్యారు. ఇక మొదటి కెప్టెన్సీ ని సొంతం చేసుకోవడంతో ప్రతి ఒక్కరు బాలాదిత్య టైటిల్ విన్నర్ గా నిలుస్తాడు అంటూ ముందే ఆయన గురించి పాజిటివ్ టాక్ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేముందు బాలాదిత్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు.. బాలాదిత్య మాట్లాడుతూ తన చదువు విషయంలో తన తల్లి ప్రధాన పాత్ర పోషించింది అని సినిమాలలో నటించినా సరే ఏ రోజు చదువు ఆ రోజే పూర్తి చేయాలని చెప్పేది అంటూ బాలాదిత్య వెల్లడించారు. ఇక తన అన్నయ్య తనకు నోట్స్ రాసి ఇచ్చేవారు అని, ఏ విషయంలో కూడా తనని ఇబ్బంది పెట్టలేదు అని, ఇప్పటికీ అన్నా వదిన ఎలా చెప్తే అలా వింటాను అని బాలాదిత్య వెల్లడించారు.

Uday Kiran Vs Junior NTR : ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు  సార్లు పోటీ పడ్డారు.. ఎవరు నెగ్గారో తెలుసా?

ఇక బాలాదిత్య తన తండ్రి గురించి చెబుతూ తన తండ్రి తనకు ఇన్స్పిరేషన్ అని, ఏ విషయంలో అయినా సరే తనకే సపోర్టు ఇచ్చేవారు అని, ఇక అంతేకాదు తప్పు చేస్తే తప్ప, ఎవరి దగ్గర తలవంచకు.. ఎవరికీ నీవు జవాబుదారు కాదు అంటూ చెప్పేవారు అని బాలాదిత్య తెలిపారు. ఇకపోతే తన తల్లి సినిమాలలోకి వెళ్లి అప్పుడే హీరో అవ్వదు అని చెప్పినా కూడా ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ , తరుణ్ లను చూసి వారు వరుస హిట్లను సొంతం చేసుకుంటుంటే నేను కూడా వారిని చూసి ఇండస్ట్రీలోకి వచ్చి తప్పు చేశాను అంటూ ఫీల్ అయ్యారు బాలాదిత్య. ఇక పొలిమేర సినిమా ఈయన కెరీర్ కు బ్రేక్ ఇచ్చిందని కూడా తెలిపాడు.

Share post:

Latest