మీకు తెలుసా? ఒకానొక సమయాన బాహుబలి సినిమా ఆగిపోయేదే అంట?

బాహుబలి… సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు. దర్శక దిగ్గజం SS రాజమౌళి తెలుగు సినిమాని ఒక్క దెబ్బతో అందలానికి ఎక్కించారు. దర్శకుడిగా రాజమౌళి సినిమా అంటే తెలుగువాళ్ళకు కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాతో యావత్ ప్రపంచమే అతనివైపు చూసేలా చేసాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాను ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించిన సంగతి విదితమే.

ఇక తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభు యార్లగడ్డ బాహుబలి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… “2009లో మర్యాద రామన్న సినిమాతో మాకు మంచి సక్సెస్ వచ్చింది. ఈ సినిమా అనంతరం బాహుబలి సినిమాని చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా భారీగా పెరిగిపోయింది. ఈ విధంగా ఈ సినిమా బడ్జెట్ ఊహించని దానికన్నా రెడ్డింతలు పెరిగిపోవడంతో ఒకానొక సమయంలో రాజమౌళి ఈ సినిమాని ఇక్కడితో ఆపేద్దాం. మనం వేరే ప్రాజెక్టు ఏదైనా చేద్దాం!” అని అన్నారట.

ఇక సినిమా మధ్యలో ఆపేయాలని రాజమౌళి చెప్పడంతో శోభు యార్లగడ్డకి మొదట కాస్త ఇబ్బందిగా అనిపించిందట. అయినా ఈ సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితులను సినిమా ఆపకూడదని రిస్క్ చేసి ఈ సినిమా చేశారట. దాంతో అప్పుడు రిస్క్ చేయడం వల్లే ఈ సినిమాకి మంచి ఫలితం లభించిందని ఈ సందర్భంగా అప్పుడు జరిగిన సంఘటనలను శోభు యార్లగడ్డ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఇక బాహుబలి రికార్డ్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు.

Share post:

Latest