“ఆస్కార్ వచ్చినంత మాత్రానా కొంప మునగదు కదా”..జక్కన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేసిన సంచలనమే. ఏ పని చేయాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించి చేసే రాజమౌళి అంటే సినీ ఇండస్ట్రీలో చాలామందికి అభిమానం. ఆయన ప్లాన్ చేస్తే దానికి తిరుగు ఉండదు అంటూ చెప్పుకొచ్చే జనాలు కోట్లల్లో ఉన్నారు. ఆయన డైరెక్షన్ ఇష్టపడే జనాలు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు . బాహుబలి, ఆర్ ఆ ర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఓ సపరేటు గుర్తింపుని సంపాదించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది.

రీసెంట్ గా టొరంటో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫారెన్ టూర్ లో బిజీగా ఉన్న రాజమౌళి అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో భాగమయ్యారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను అక్కడ మీడియాతో పంచుకున్నారు. కాగా అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయిన రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇవ్వడమే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అన్ బిలివబుల్ కామెంట్స్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు.


కాగా అక్కడ మీడియా వాళ్ళు “ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వస్తుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంది. మరి మీరు దీనిపై ఏమంటారు ” అంటూ జక్కన్నను ప్రశ్నించగా ఆయన చెప్పిన ఆసక్తికర ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. రాజమౌళి మాట్లాడుతూ..” ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చినంత మాత్రాన నా నెక్స్ట్ సినిమాల యొక్క ప్లాన్ చేంజ్ అవ్వదు . ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా నేను నేను గానే ఉంటాను . రాజమౌళి లాగే సినిమా డైరెక్టర్ చేస్తాను . ఆస్కార్ వస్తే హాలీవుడ్ సినిమాలు చేస్తాను ..లేదంటే హిందీ సినిమాలు చేస్తాను వంటివి నా దగ్గర పనికిరావు . ఏ అవార్డు వచ్చినా రాకపోయినా నా మనసు చెప్పిన విధంగానే నేను డైరెక్ట్ చేస్తాను” అంటూ అక్కడ మీడియాకి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు. అయితే ఇదే మాటలను జక్కన్న అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతే కదా “ఆస్కార్ వస్తే కొంప మునగదు కదా ..ఓ నటనకు ..వారిలోని టాలెంట్ కు గుర్తింపు అంతే.. ఆస్కార్ వచ్చినంత మాత్రాన మనలోని నటన తగ్గిపోదు పెరిగిపోదు” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest